తెలంగాణ

‘కోడ్’ తో స్తంభించిన పాలన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 13: తెలంగాణలో ప్రభుత్వ పాలన గత తొమ్మిది నెలల నుండి స్తబ్దుగా కొనసాగుతోంది. వరుసగా ఎన్నికలు జరుగుతుండటమే ఇందుకు కారణం. తెలంగాణ అసెంబ్లీని 2018లో సెప్టెంబర్‌లో రద్దు చేసినప్పటి నుండి వాతావరణం అంతా ఎన్నికల చుట్టే తిరుగుతోంది. అసెంబ్లీ ఎన్నికల కార్యక్రమం ప్రారంభమైనప్పటి నుండి డిసెంబర్ రెండోవారం వరకు అసెంబ్లీ ఎన్నికల ప్రహసనం కొనసాగింది. ఆ తర్వాత మంత్రివర్గం ఏర్పాటుకోసం నెలరోజులపైగా సమయం పట్టింది. ఈ లోగా గ్రామ పంచాయతీ ఎన్నికలు పూర్తయ్యాయి. పంచాయతీ ఎన్నికలు పూర్తయిన వెంటనే లోకసభ ఎన్నికలు వచ్చేశాయి. ఇప్పుడు మళ్లీ పరిషత్ (జడ్పీటీసీ, ఎంపీటీసీ) ఎన్నికలు జరుగుతున్నాయి. పరిషత్ ఎన్నికల్లో భాగంగా ఇప్పటికే రెండు విడతలు పూర్తి కాగా, తుది దశ పోలింగ్ ఈ నెల 14 న నిర్వహిస్తున్నారు. ఈ పరిస్థితిలో పరిపాలన ఒక రకంగా స్తంభించిపోయింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2019-20 ఆర్థిక సంవత్సరానికి పూర్తిస్తాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టకుండా ‘ఓట్ ఆన్ అకౌంట్’నే ప్రతిపాదించారు.
మంత్రులు తమ తమ శాఖలపై అవగాహన కల్పించుకునేందుకు, జరిపే రివ్యూలు కూడా జరగడం లేదు. ఉద్యోగులకు వేతనాలు చెల్లించడం, గత ఐదేళ్లలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు, కార్యక్రమాలు కొనసాగించడంపైనే ప్రభుత్వ దృష్టి కేంద్రీకరించింది. 2019 ఖరీఫ్ దగ్గరకొస్తున్నప్పటికీ ప్రభుత్వం పంటలకు సంబంధించి ఒక ప్రణాళిక రూపొందించలేదు. రైతుబంధు పథకం గురించి ఎవరూ పట్టించుకోవడం లేదు. గత ఏడాది ఇదే సమయానికి రైతుబంధు పథకాన్ని పూర్తిగా అమలు చేశారు. ఈ ఏడాది ఇంకా దీనిపై ఒక అవగాహన రాలేదు. అన్ని శాఖల పరిస్థితి కూడా ఇదే విధంగా కొనసాగుతోంది. అధికార పార్టీతో పాటు విపక్షాలు ఎన్నికల్లో నిమగ్నమై ఉండటంతో పార్టీల నాయకులు ఎన్నికల్లోనే బిజీగా ఉంటున్నారు. దాంతో పరిపాలనపై ఎవరూ దృష్టి కేంద్రీకరించలేకపోతున్నారు. ప్రజలు కూడా ఈ పరిస్థితికి అలవాటుపడ్డారు.