తెలంగాణ

నగేశ్ ముదిరాజ్‌పై సస్పెన్షన్ వేటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: నగేశ్ ముదిరాజ్‌పై కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ సంఘం సస్పెన్షన్ వేటు వేసింది. ఈనెల 11 ఇందిరాపార్క్ వద్ద జరిగిన ఘర్షణ నేపథ్యంలో మాజీ ఎంపీ వీహెచ్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నగేశ్ ముదిరాజ్‌కు సంబంధించిన వ్యవహారంపై గాంధీభవన్‌లో సోమవారంనాడు క్రమశిక్షణ సంఘం విచారణ చేపట్టింది. నగేశ్ ముదిరాజ్ విచారణకు హాజరై వివరణ ఇచ్చారు. వీహెచ్ లిఖితపూర్వకంగా వివరణ ఇవ్వటం జరిగింది. పార్టీ నేతలు అందించిన సమాచారాన్ని సైతం కూడా పరిశీలించిన తరువాత నగేశ్ ముదిరాజ్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. కాగా పార్టీ ఆదేశాలపై నగేశ్ ముదిరాజ్ నిరసన వ్యక్తంచేశారు.