తెలంగాణ

వీహెచ్‌పై దాడి చేసిన నగేశ్‌పై వేటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 13: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ (పీసీసీ) ప్రధాన కార్యదర్శి నగేశ్ ముదిరాజ్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్టు టీపీసీసీ క్రమశిక్షణా సంఘం సోమవారం ప్రకటించింది. ఈ నెల 11న ఇందిరాపార్క్ వద్ద జరిగిన అఖిల పక్ష ధర్నా సందర్భంగా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వి హనుమంతరావుపై నగేశ్ దాడి చేయడాన్ని తీవ్రంగా పరిగణించి పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్టు టీపీసీసీ క్రమశిక్షణా సంఘం చైర్మన్ కోదండరెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇందిరాపార్క్ వద్ద పార్టీ నాయకులు హనుమంతరావు, నగేశ్ మధ్య జరిగిన కోట్లాటపై వారిద్దరూ సోమవారం క్రమశిక్షణా సంఘం ఎదుట హాజరై వివరణ ఇచ్చినట్టు పేర్కొన్నారు. ఇరువురి వాదనలు విన్న తర్వాత నగేశ్‌పై చర్యకు క్రమశిక్షణా సంఘం నిర్ణయం తీసుకున్నట్టు కోదండరెడ్డి వివరించారు. ఇలా ఉండగా తనను పార్టీ నుంచి సస్పెండ్ చేయడాన్ని నిరసిస్తూ నగేశ్ ముదిరాజ్ గాంధీభవన్ ఎదుట ధర్నాకు దిగారు. క్రమశిక్షణా సంఘం ఏకపక్షంగా, పక్షపాతంగా వ్యవహరించిందని నగేశ్ ఆరోపించారు. తనపై దాడి చేసిందీ విహెచ్‌నని వీడియో క్లిపింగ్‌ల్లో స్పష్టంగా ఉందని, ఇందిరాపార్క్ సంఘటనను టీవీ చానల్స్ ప్రత్యక్ష ప్రసారం చేశాయని ఆయన గుర్తు చేశారు. తనపై దాడి చేసిన విహెచ్‌పై చర్య తీసుకోకుండా తనపైనే చర్య తీసుకోవడంలో ఎవరి వత్తిడి ఉందని ఆయన ప్రశ్నించారు. తన అక్రమ సప్పెన్షన్‌పై న్యాయపోరాటం చేస్తానని నగేశ్ హెచ్చరించారు. విహెచ్‌పై కూడా చర్య తీసుకునే వరకు ఇందిరాపార్క్ వద్దనే నిరవధిక నిరాహార దీక్ష చేస్తానని ఆయన నగేశ్ ప్రకటించారు.