తెలంగాణ

పంచాయతీ కార్యదర్శి ఫీల్డ్ అసిస్టెంట్ తొలగింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వనపర్తి, మే 13: మరుగుదొడ్ల నిర్మాణంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన వనపర్తి జిల్లా కొత్తకోట మండలం పాలెం క్షేత్ర సహాయకుడు రాఘవేందర్ రెడ్డిని, పంచాయతీ కార్యదర్శిని ఉద్యో గం నుండి తొలగిస్తున్నట్టు జిల్లా కలెక్టర్ శే్వతా మహంతి తెలిపారు. సోమవారం ఆమె కొత్తకోట మండలం పాలెం గ్రామంలో స్వక్షభారత్ మిషన్ కింద మంజూరైన మరుగుదొడ్ల నిర్మాణాల పురోగతిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. మరుగుదొడ్ల నిర్మాణ విషంయంలో నిర్లక్ష్యం వహిస్తే సహించబోమని ఆమె ఈ సందర్బంగా హెచ్చరించారు. మరుగుదొడ్ల నిర్మాణం పూర్తి కాకున్నా పూర్తయినట్టు, అలాగే తప్పుడు నివేదికల ద్వారా జిల్లా అధికారులను తప్పుదోవ పట్టించినందుకు పాలెం క్షేత్ర సహాయకుడు రాఘవేందర్ రెడ్డిని, అలాగే పంచాయతీ కార్యదర్శిని ఉద్యోగం నుండి తొలగిస్తున్నట్టు ప్రకటించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మరుగుదొడ్ల నిర్మాణ పురోగతిని సమీక్షించారు. నిర్దేశించిన లక్ష్యం మేరకు నిర్మాణం పూర్తి చేయాలని, మరుగుదొడ్ల విషయంలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కలెక్టర్ వెంట డిఆర్‌డిఓ గణేశ్ తదితరులు ఉన్నారు.
చిత్రం...మరుగుదొడ్ల నిర్మాణంపై సమీక్షిస్తున్న కలెక్టర్ శే్వతా మహంతి