తెలంగాణ

శాసన మండలికి లక్ష్మి ఎన్నిక తథ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, మే 14: ఉమ్మడి నల్లగొండ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సతీమణి లక్ష్మి మంగళవారం తన నామినేషన్ దాఖలు చేశారు. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, రాజగోపాల్‌రెడ్డి, జడ్పీ చైర్మన్ ఎన్.బాలునాయక్‌లతో కలిసి ఆమె కలెక్టరేట్‌లో ఎన్నికల అధికారి, జాయింట్ కలెక్టర్ చంద్రశేఖర్‌కు తన నామినేషన్ పత్రాలు సమర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో కోమటిరెడ్డి బ్రదర్స్ మాట్లాడుతూ ఇదే స్థానానికి ఎమ్మెల్సీగా తనను గెలిపించిన స్థానిక ఓటర్లే నేడు తన భార్య లక్ష్మిని గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. గతంలో స్థానిక ఓటర్లలో టీఆర్‌ఎస్‌కు బలం లేనప్పటికీ అధికార పార్టీగా అహంభావంతో పారిశ్రామికవేత్తయైన తేరా చిన్నపరెడ్డిని పోటీకి దింపి ఆయనను బలిపశువు చేసిందన్నారు. మళ్లీ కోమటిరెడ్డి లక్ష్మిని కాంగ్రెస్ పోటీకి దించబోతుందని తెలిసి చిన్నపరెడ్డిని అభ్యర్థిగా ప్రకటించారన్నారు. గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిపోయాక చిన్నపరెడ్డి జిల్లా రాజకీయాల్లో కనిపించలేదన్నారు. కేసీఆర్ మాయమాటలను నమ్మి ఆర్థిక బలాన్ని నమ్ముకుని ఉప ఎన్నికల బరిలో నిలిచిన చిన్నపరెడ్డికి రెండోసారి ఓటమి తప్పదన్నారు. తనను గెలిపించిన స్థానిక సంస్థల ఓటర్లతో తనకు మంచి సంబంధాలున్నాయని వారిలో చాలామంది సూచన మేరకే ఎమ్మెల్సీ అభ్యర్థిగా లక్ష్మిని పోటీలోకి దించామన్నారు. కొంతమంది ప్రతిపక్షాల స్థానిక ఓటర్లు టీఆర్‌ఎస్‌లోకి వెళ్లినా ఎన్నికల్లో తమకే ఓటు వేస్తారని కోమటిరెడ్డి బ్రదర్స్ ధీమా వ్యక్తం చేశారు. ఎంపీ ఎన్నికల్లో డబ్బున్న వారికే టికెట్లు అమ్ముకున్న సీఎం కేసీఆర్ ఎమ్మెల్సీ టికెట్లను సైతం అదే పద్ధతిలో కేటాయించారని ఆరోపించారు. ఎన్నికలను పూర్తిగా డబ్బు మయం చేస్త్తూ, రాష్ట్రంలో అప్రజాస్వామిక, నియంతృత్వ పాలన సాగిస్తున్న సీఎం కేసీఆర్‌కు బుద్ధి చెప్పేందుకు స్థానిక ఓటర్లు ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ను ఓడించాలని ఆయన కోరారు. ఇప్పటికే ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ను ఓడించి నల్లగొండ జిల్లా చైతన్యాన్ని చాటిన స్ఫూర్తితో స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ టీఆర్‌ఎస్‌ను ఓడించాలని కోమటిరెడ్డి బ్రదర్స్ కోరారు. ఎమ్మెల్సీ అభ్యర్థి కోమటిరెడ్డి లక్ష్మి మాట్లాడుతూ తన భర్త గెలుపు కోసం ప్రచారం సాగించిన సందర్భంగా ప్రజల సమస్యలపై, రాజకీయాలపై తనకు అవగాహన ఏర్పడిందన్నారు. కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసుకునేందుకు పార్టీ నాయకుల సూచనలతో, కొంతమంది స్థానిక ఓటర్ల అభ్యర్థనతో తాను పోటీకి సిద్ధపడ్డానన్నారు. ఈ ఎన్నికల్లో తనను గెలిపించి ప్రజలకు సేవచేసే అవకాశం కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు శంకర్‌నాయక్, కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి, మున్సిపల్ చైర్‌పర్సన్ బొడ్డుపల్లి లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
చిత్రం... నామినేషన్ దాఖలు చేస్తున్న కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి కోమటిరెడ్డి లక్ష్మి