తెలంగాణ

పరిషత్ పోలింగ్‌కు ‘పంచాయతీ’ తంటా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిలాబాద్,మే 14: ప్రాదేశిక ఎన్నికల చివరి అంకం ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో ప్రశాంతంగానే ముగిసినప్పటికీ తమ గిరిజన గూడేలను పంచాయతీలుగా ఏర్పాటు చేయకపోవడాన్ని నిరసిస్తూ రెండు గిరిజన గ్రామాలు స్వచ్ఛందంగా మంగళవారం ఎన్నికలను బహిష్కరించాయ. ఆదిలాబాద్ జిల్లా సిరికొండ మండలం రాంజీగూడ, నేరడిగొండకె మారుమూల గ్రామాలు అభివృద్ధికి ఆమడదూరంలో ఉండగా తమ గ్రామాలను కొత్తపంచాయతీలుగా ఏర్పాటు చేయాలని పలుమార్లు అధికారులకు గ్రామస్థులు విన్నవించారు. అయినా తమ డిమాండ్ నెరవేరకపోవడంతో మొన్నటి లోక్‌సభ ఎన్నికల్లో ఈ రెండు గ్రామాల ప్రజలు ఓటు హక్కు వినియోగించుకోలేదు. పైగా ఈ గ్రామాల్లో పోలింగ్ బూత్‌లను కూడా ఏర్పాటు చేయకపోవడంపై రాంజీగూడ, నేరడిగొండకె గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ మంగళవారం కొత్తపల్లి పోలింగ్ బూత్‌కు వెళ్ళకుండా తమ గ్రామాల్లో బైఠాయించి నిరసన తెలిపారు. ఈ రెండు గ్రామాల్లో 280 మందికి పైగా ఓటర్లు ఉన్నారు. మరోవైపు బోథ్ మండలం దివిటి గ్రామస్థులు సైతం రెండో విడత ప్రాదేశిక ఎన్నికల్లో పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయకపోవడాన్ని నిరసిస్తూ ఓటు హక్కును బహిష్కరించిన విషయం విదితమే. ఇదిలా ఉంటే మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం బద్దేపల్లి పోలింగ్ బూత్‌లో గందరగోళం చోటుచేసుకుంది. బద్దేపల్లికి సంబంధించి ఎంపీటీసీ బ్యాలెట్ పత్రాలను రాపెల్లి పోలింగ్ బూత్‌లో ఓటర్లకు అందజేయడంతో కాంగ్రెస్ అభ్యర్థి ఈ వ్యవహారాన్ని అధికారుల దృష్టికి తీసుకువచ్చి నిరసన తెలిపారు. అధికారుల తప్పిదం వల్లే బ్యాలెట్ పత్రాలు తారుమారయ్యాయని అంగీకరించిన ఎన్నికల సంఘం చివరకు రెండు గంటల ఆలస్యంగా యథావిధిగా పోలింగ్ నిర్వహించారు. అప్పటికే 42 మంది ఓటు హక్కు వినియోగించుకోగా వీరికి మరోసారి ఓటు వేసేందుకు అవకాశం కల్పించారు. ఇదే జిల్లాలోని దండేపల్లి మండలం వెంకటాపూర్‌లో పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయకపోతే తాము ఎన్నికలు బహిష్కరిస్తామని గ్రామస్థులు ముందుగానే స్పష్టం చేయడంతో రాష్ట్ర ఎన్నికల సంఘం స్పందించి కొత్తగా వెంకటాపూర్‌లో పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయడంతో ఓటింగ్ ప్రశాంతంగా సాగింది.
నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలైనా మంచిర్యాల జిల్లాలోని 4 జడ్పీటీసీలు, 17 ఎంపీటీసీ స్థానాల్లో మంగళవారం చివరి విడత పోలింగ్ నిర్వహించగా 45 నక్సల్స్ సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఆసిఫాబాద్ కుమ్రంభీం జిల్లాలో 4 జడ్పీటీసీలు, 36 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్ జరగగా 187 పోలింగ్ కేంద్రాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేసి నిఘా ముమ్మరం చేశారు. ఈ జిల్లాలో 75.65 శాతం పోలింగ్ జరగడం గమనార్హం. మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాల్లో సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ఘట్టాన్ని ముగించారు.
చిత్రం... ఎన్నికలు బహిష్కరించి నిరసన తెలుపుతున్న రాంజీగూడ గ్రామస్థులు