తెలంగాణ

బాసర ట్రిపుల్ ఐటీ అడ్మిషన్ల షెడ్యూలు ఖరారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 14: తెలంగాణ బాసర లోని రాజీవ్ గాంధీ నాలెడ్జి టెక్నాలజీస్ యూనివర్శిటీ ఆధ్వర్యంలోని ట్రిపుల్ ఐటీలో ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్ ఇంజనీరింగ్ కోర్సులో ప్రవేశానికి అడ్మిషన్ల నోటిఫికేషన్‌ను వీసీ డాక్టర్ అశోక్ కుమార్ విడుదల చేశారు. పదో తరగతి విద్యార్హతతో ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్ ఇంజనీరింగ్ కోర్సులో చేరేందుకు ఈ నెల 24వ తేదీ వరకూ దరఖాస్తులను స్వీకరిస్తారు. రిజర్వేషన్ల రోస్టర్, మార్కుల ప్రాతిపదికగా అడ్మిషన్లను చేపడతారు. పదోతరగతి పరీక్షలు రాసిన ప్రతి ఒక్కరూ దరఖాస్తుచేసుకునేందుకు అర్హులేనని ఆయన చెప్పారు. ఆన్‌లైన్ దరఖాస్తు కాపీలను ప్రింటవుట్ తీసి యూనివర్శిటీకి పంపించాలని ఆయన సూచించారు. ఎంపిక జాబితాను జూన్ 10న విడుదల చేస్తామని పేర్కొన్నారు. జూన్ 18,19 తేదీల్లో తొలి విడత కౌనె్సలింగ్ నిర్వహిస్తామని, సైనికోద్యోగుల పిల్లలు, వికలాంగులు, ఎన్‌సీసీ, స్పోర్ట్సు కోటా అభ్యర్ధులకు జూన్ 21,22,23 తేదీల్లో కౌనె్సలింగ్ ఉంటుందని అన్నారు. అడ్మిట్ అయిన విద్యార్ధుల ఓరియంటేషన్ క్లాసులు జూలై 2న ప్రారంభం అవుతాయని, గత ఏడాది చేరిన విద్యార్ధులకు జూలై 3 నుండి తరగతులు ప్రారంభం అవుతాయని చెప్పారు. అడ్మిషన్లకు సంబంధించి అనుమానాలుంటే 9573001992 లేదా 9703760686 నెంబర్లకు ఫోన్ చేసి నివృత్తి చేసుకోవాలని ఆయన చెప్పారు.