తెలంగాణ

పోలింగ్ వివరాలను దాచిపెట్టడం ఎందుకు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 15: రాష్ట్రంలో నిజామాబాద్, సికింద్రాబాద్, ఖమ్మం, చేవెళ్ల తదితర లోక్‌సభ నియోజకవర్గాల్లో సాయంత్రం 5 గంటలకు, ఆ తర్వాత నమోదైన పోలింగ్ వివరాలు తమకు ఇవ్వాలని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఎన్నికల కమిషన్‌ను డిమాండ్ చేసింది. ఈ విషయమై తాము ఎన్నికల ప్రదానాధికారికి లేఖ రాసినా, సానుకూలంగా స్పందించలేదన్నారు. ఎన్నికల ప్రదానాధికారి తమకు రాసిన లేఖ సంతృప్తికరంగా లేదని, నిష్పక్షపాతంగా ఎన్నికల సంఘం వ్యవహరించాలని ఆ పార్టీ కోరింది. బుధవారం ఇక్కడ గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో పార్టీ సీనియర్ నేతలు మర్రి శశిధర్ రెడ్డి, జీ నిరంజన్ తదితరులు మాట్లాడుతూ, రిటర్నింగ్ ఆఫీసర్లు సాయంత్రం 5 గంటలకు ఆ తర్వాత నమోదైన పోలింగ్ వివరాలు రిజిస్టర్ చేస్తారన్నారు. కచ్చితమైన గణాంక వివరాలు తమకు పొందుపరచాలని వారు కోరారు. తాము కోరిన నాలుగు లోక్‌సభ నియోజకవర్గాల్లో అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా పోలైన ఓట్ల వివరాలను తెలియచేయాలన్నారు. అలాగే పోలింగ్ తీరుపై తీసిన వీడియో ఫుటేజీ వివరాలు కావాలని కోరామన్నారు. కాని కౌంటింగ్ ప్రక్రియ పూర్తయిన 45 రోజుల తర్వాత నిర్ణీత ఫీజు చెల్లిస్తే సమకూర్చుతామని ఎన్నికల కమిషన్ బదులిచ్చిందన్నారు. అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి రిటర్నింగ్ ఆఫీసర్లకు ఎప్పటికప్పుడు పోలింగ్ గురించి వివరాలు వస్తాయన్నారు. తాము అడిగిన కనీస సమాచారాన్ని ఎన్నికల సంఘం ఇవ్వలేకపోవడం విచారకరమన్నారు. ఇందులో దాచిపెట్టేందుకు ఏముందని, పారదర్శకంగా, ప్రజాస్వామ్య యుతంగా ఎన్నికల కమిషన్ వ్యవహరించాలన్నారు. ఎన్ని నియోజకవర్గాల్లో సాయంత్రం 5 గంటల తర్వాత అసాధారణ స్థాయిలో ఓటింగ్ పెరిగిందో తెలియచేయాలని వారు కోరరు. ప్రజలకు, రాజకీయ పార్టీలకు వాస్తవాలు తెలియచేయాల్సిన బాధ్యత ఎన్నికల సంఘంపై ఉందన్నారు.