తెలంగాణ

ఎమ్మెల్సీగా గుత్తానా? నవీన్‌రావా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 15: ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ స్థానానికి జరుగనున్న ఎన్నికకు అభ్యర్థి ఎంపిక తెలంగాణ రాష్ట్ర సమితికి పరీక్షగా మారింది. ఒక్క ఎమ్మెల్సీ స్థానానికి ఇద్దరు నేతలకు పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు హామీ ఇవ్వడంతో వీరిలో అవకాశం ఎవరికి దక్కుతుందన్నది పార్టీలో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. పార్లమెంట్ ఎన్నికల అభ్యర్థుల ప్రకటన సందర్భంగా టికెట్ దక్కని ఇద్దరు నేతలకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించనున్నట్టు పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటించారు. వీరిలో నల్లగొండ సిట్టింగ్ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి, మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే, ఎంపీ టికెట్ ఆశించిన నవీన్‌రావు ఉన్నారు. అయితే మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే టికెట్ మైనంపల్లి హనుమంతరావుకు, ఎంపీ టికెట్ మర్రి రాజశేఖర్‌రెడ్డికి ఇవ్వడంతో ఎమ్మెల్సీగా తనకే అవకాశం దక్కుతుందని నవీన్‌రావు ధీమాగా ఉన్నారు. మైనంపల్లి హనుమంతరావు మల్కాజ్‌గిరి ఎమ్మెల్యేగా ఎన్నిక కావడంతో తన ఎమ్మెల్సీ పదవికి ఆయన రాజీనామా చేశారు. దీంతో నవీన్‌రావు తనకు లైన్ క్లియర్ అయిందని భావించారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానానికి కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ జారీ చేసింది. ఎమ్మెల్సీగా అవకాశం కల్పించనున్నట్టు పార్టీ అధినేత కేసీఆర్ హామీ ఇవ్వడంతో ప్రస్తుతం ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానం కోసం నవీన్‌రావుతో పాటు నల్లగొండ ఎంపీ గుత్తాసుఖేందర్‌రెడ్డి ఇద్దరు పోటీ పడుతున్నారు. మరోవైపు స్థానిక సంస్థల కోటాలో జరుగుతున్న మూడు ఎమ్మెల్సీ స్థానాలకు ఈ నెల 31న ఎన్నికలు జరుగనున్నాయి. ఈ మూడు స్థానాలకు టీఆర్‌ఎస్ ప్రకటించిన అభ్యర్థులు పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి (వరంగల్), తేరా చిన్నపరెడ్డి (నల్లగొండ), పట్నం మహేందర్‌రెడ్డి (రంగారెడ్డి) అందరూ ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు కాగా తాజాగా షెడ్యూల్ ప్రకటించిన ఎమ్మెల్సీ స్థానానికి కూడా ఇదే సామాజిక వర్గానికి చెందిన గుత్తా సుఖేందర్‌రెడ్డి ఇవ్వడం సబబుగా ఉండదని టీఆర్‌ఎస్ అధిష్ఠానం భావిస్తుంది. సామాజిక సమీకరణల నేపథ్యంలో నవీన్‌రావుకు అవకాశం కల్పించడమే ఉత్తమమని పార్టీ ముఖ్య నేతలు కూడా అధినేత కేసీఆర్‌కు సూచించినట్టు సమాచారం. ఇలా ఉండగా ఉమ్మడి నల్లగొండ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా గుత్తా సుఖేందర్‌రెడ్డిని పోటీ చేయాల్సిందిగా అధిష్ఠానం కోరగా ఆయన నిరాకరించారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా పోటీ చేసి గెలిచే కంటే ఎమ్మెల్యే కోటా నుంచి ఏకగ్రీవంగా ఎన్నిక కావడానికే గుత్తా సుఖేందర్‌రెడ్డి ఆసక్తికనబర్చారు. ఎక్కడి నుంచి అయితే ఎమ్మెల్యే టికెట్ ఆశించానో అక్కడి ఎమ్మెల్యే రాజీనామాతో ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానానికి తనకే అవకాశం ఇవ్వాలని నవీన్‌రావు అధిష్ఠానంపై వత్తిడి చేస్తున్నారు. ఒకవైపు ఎంపీ గుత్తా, మరోవైపు పార్టీ అవిర్భావం నుంచి పార్టీలో అనేక బాధ్యతలు నిర్వహించిన నవీన్‌రావు ఇద్దరూ ఎమ్మెల్సీ కోసం పోటీ పడుతుండటంతో ఇందులో ఎవరికి అవకాశం కల్పించాలనే అంశం టీఆర్‌ఎస్ అధిష్ఠానానికి పరీక్షగా మారింది.