తెలంగాణ

మధ్యాహ్న భోజనానికి రూ. 177 కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 15: మధ్యాహ్న భోజన పథకం అమలులో భాగంగా 1వ తరగతి నుండి 8వ తరగతి వరకూ మొదటి విడతగా 177.70 కోట్లు విడుదల చేసినట్టు పాఠశాల విద్య కమిషనర్ డాక్టర్ విజయకుమార్ తెలిపారు. తెలంగాణ రాష్టత్రంలో 28621 పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలుచేస్తున్నామని, ఈ పాఠశాలల్లో 1వ తరగతి నుండి 5వ తరగతి వరకూ 11,95,440 విద్యార్థులు, ఆరో తరగతి నుండి 8వ తరగతి వరకూ 7,18,428 మంది, 9, 10 తరగతుల్లో 4,73,883 మంది విద్యార్థులు లబ్ది పొందుతున్నారని ఆయన చెప్పారు. మధ్యాహ్న భోజన పథకం అమలుకు 1వ తరగతి నుండి 8వ తరగతి వరకూ కేంద్రప్రభుత్వం 60 శాతం నిధులను, రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం నిధులను సమకూరుస్తోందని చెప్పారు. 9, 10 తరగతులకు మాత్రం మొత్తం ఖర్చును రాష్ట్ర ప్రభుత్వమే వెచ్చిస్తోందని అన్నారు. ఈ ఏడాది 9, 10 తరగతులకు మొదటి విడతగా 8.02 కోట్లు విడుదల చేశామని అన్నారు. ఈ నిధుల నుండి ఏప్రిల్ 1వ తేదీతో పెంచిన వంట ఖర్చుల బకాయిలు, 2018-19 విద్యాసంవత్సరానికి సంబంధించిన పెండింగ్ బిల్లును చెల్లిస్తామని అన్నారు.