తెలంగాణ

సంస్కరణల ఫలితం...17 జైళ్లకు తాళం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సైదాబాద్, మే 17: తెలంగాణ జైళ్లశాఖ వినూతనంగా ప్రవేశపెట్టి అమలు పరుస్తున్న సంస్కరణల ఫలితంగా తెలంగాణలోని 49 జైళ్లలో 17 జైళ్లను తాత్కాలికంగా మూసివేసామని తెలంగాణ జైళ్లశాఖ డీజీ వీకే సింగ్ వెల్లడించారు. నేర రహిత సమాజం కోసం జైళ్లశాఖ అనుసరిస్తున్న విధానాలు సత్ఫలితాలు ఇస్తున్నాయని వీకే.సింగ్ తెలిపారు. శుక్రవారం చంచల్‌గూడలోని జైళ్ల శాఖ సీకా కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో వీకే.సింగ్ మాట్లాడుతూ, మూసివేసిన జైళ్లలో సాంఘిక సంక్షేమ కార్యక్రమాలు, జైళ్లశాఖ యాచక రహిత సమాజం కోసం నిర్వహిస్తున్న ఆనంద ఆశ్రమాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి నివేదికలు పంపామని తెలిపారు. నేర రహిత సమాజం సాధించడం ద్వారా తెలంగాణలోని జైళ్లు అన్నింటిని మూసి వాటిలో ఇండస్ట్రియల్ సొసైటీ, ఎడ్యుకేషనల్ సొసైటీలు ఏర్పాటు చేయటం తన లక్ష్యమని వివరించారు. 2025 వరకు జైళ్లశాఖ రూ.200ల కోట్లు వార్షికాదాయం సాధించేలా ప్రణాళికలు రూపొందించామని అన్నారు. రానున్న మూడు నెలల్లో రాష్ట్ర వ్యాప్తంగా మరో 20 పెట్రోల్ బంకులు ప్రారంభిస్తున్నామని తెలిపారు. తద్వారా విడుదల కాబడిన ఖైదీలకు ఉపాధి కల్పిస్తామని, జైళ్ల శాఖ సంస్కరణల ద్వారా 1000 మంది నేరస్తులను మార్చి వారు సమాజంలో గౌరవంగా బతికేలా ఉపాధి కల్పిస్తున్నాని అన్నారు. పేద, మధ్య తరగతి కుటుంబాల కోసం జైళ్ల శాఖ త్వరలో రియల్ ఎస్టేట్ రంగంలోకి అడుగుపెడుతుందని, తక్కువ ధరలో విక్రయాల ద్వారా ప్రజలకు, ఉపాధి కల్పన ద్వారా విడుదలైన ఖైదీలకు ఉపయుక్తంగా అదేవిధంగా జైళ్లళాఖ వార్షికాదాయం పెరిగేలా రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ప్రణాళికలు రూపొందిస్తున్నామని అన్నారు. ప్రభుత్వం అనుమతిస్తే ప్రభుత్వ పాఠశాలలు, ఆసుపత్రులలో అభివృద్ధి కార్యక్రమాలకు జైళ్లశాఖ సిద్ధంగా ఉందన్నారు. ఈ సమావేశంలో జైళ్లశాఖ ఐజీ ఆకుల నర్సింహ, డీఐజీ సైదయ్య పాల్గొన్నారు.