బిజినెస్

రిటైల్ స్థిరాస్తి రంగంలోకి ప్రైవేటు ఈక్విటీల పెట్టుబడులు ద్విగుణీకృతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 19: భారతీయ రీటైల్ స్థిరాస్తి రంగంలో గత రెండేళ్ల నుంచి ప్రైవేటు పెట్టుబడులు ద్విగుణీకృతమయ్యాయి. 2017-18 నుంచి ఇప్పటి వరకు మొత్తం 1.2 బిలియన్ డాలర్ల విలువైన పెట్టుబడులు ఈ రంగంలో వచ్చాయి. ఎఫ్‌డీఐ విధానాలను సరళీకృతం చేసిన తర్వాత ప్రైవేటు పెట్టుబడులు ఈ రంగంలోకి అధికమయ్యాయని, ప్రత్యేకించి టైర్-1 నగరాల్లో మల్టీబ్రాండ్ రీటెయిల్‌లో 51 శాతం ఎఫ్‌డీఐలు, సింగిల్ బ్రాండ్ రీటెయిల్ వ్యాపారంలో ఆటోమేటిక్ రూట్ ద్వారా 100 శాతం ఎఫ్‌డీఐలకు వెసులుబాటు కల్పించడం వంటివి జరిగిన తర్వాత స్థిరాస్తి రీటైల్ రంగంలోకి ప్రైవేటు ఈక్విటీల వెల్లువ ఆరంభమైందని మార్కెట్ విశే్లషకులు భావిస్తున్నారు. 2015-16 క్యాలెండర్ ఇయర్‌లో రీటైల్ స్థిరాస్థి రంగంలోకి 600 మిలియన్ డాలర్ల మేర వచ్చిన ప్రైవేటు ఈక్విటీల పెట్టుబడులు 2017-18 నాటికి 1.2 బిలియన్ డాలర్లకు ఎగబాకిందని గణాంకాలు చెబుతున్నాయి. అంటే గత నాలుగేళ్లుగా మొత్తం 1.84 బిలియన్ డాలర్ల విలువైన వాటాల కొనుగోళ్లు జరిగాయి. ఇక టైర్-2,3 నగరాలు సైతం సుమారు 48 శాతం అంటే 380 మిలియన్ డాలర్ల నిధులు ఆకర్షించగలిగాయి. టైర్-2,3 నగరాల్లో అత్యధిక ప్రాధాన్యం కలిగిన అమృత్‌సర్, అహ్మదాబాద్, భువనేశ్వర్, చండీగర్, ఇండోర్, మోహాలీ ఈ పెట్టుబడులు అత్యధికంగా ఆకర్షించాయి. అమెరికాకు చెందిన బ్లాక్‌స్టోన్, గోల్డ్‌మన్ సాక్స్ వంటి సంస్థలు 2015-2018 వరకు అధిక శాతం నిధులు (సుమారు ఒక బిలియన్ డాలర్లు) భారతీయ రీటెయిల్ రియల్ ఎస్టేట్ రంగంలో మదుపు చేశాయి. అలాగే యూఏఈ, సింగపూర్, కెనడా, నెదర్లాండ్స్‌కు చెందిన నిధులు సైతం ఈ రంగంలోకి వచ్చాయి. టైర్-2, 3 నగరాల్లో షాపింగ్‌మాల్స్ అధిక స్థాయిలో లాభాలను పండించాయని విశే్లషకుడు శోబిత్ అగర్వాల్ తెలిపారు. 2019-22 ఆర్థిక సంవత్సరాల నడుమ టైర్-1 నగరాల్లో 39 మిలియన్ల చదరపు అడుగుల సంఘటిత స్థలాల్లో 71 శాతం మేర పెట్టుబడులు, వాణిజ్యం విస్తరించే అవకాశాలున్నాయని, మిగిలిన 29 శాతం వృద్ధి టైర్-2,3 నగరాల్లో జరుగుతుందని అరుణ్ కేజ్రీవాల్ అనే మార్కెట్ విశే్లషకుడు పేర్కొన్నారు.