బిజినెస్

మరో 25 బేసిస్ పాయింట్ల మేర రెపోరేట్లలో కోత!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, మే 31: ఈ ఏడాది మార్చితో ముగిసిన త్రైమాసికంలో ఆర్థికాభివృద్ధి మందగించే అవకాశాలు ఉండటంతో రిజర్వు బ్యాంకు రెపోరేట్లలో 25 బేసిస్ పాయింట్ల మేర కోత విధించే అవకాశాలున్నాయి. త్వరలో జరుగనున్న ద్రవ్య వినిమయ విధాన సమీక్షా సమావేశంలో ఈ రెపోరేట్ల కోత జరుగుతుందని ఆర్థిక నిపుణులు అంచనావేస్తున్నారు. 2018-19 సంవత్సరంలో చివరి (నాల్గవ) త్రైమాసికానికి సంబంధించిన ఆర్థికాభివృద్ధి గణాంకాలు మరికొన్ని గంటల్లో విడుదల కానున్నాయి. డీబీఎస్ గ్రూప్ సంస్థ పరిశోధనా నివేదిక మేరకు ఈ ఆర్థికాభివృద్ధి 6.1 శాతం ఉండే అవకాశాలున్నాయి. ఇది గడచిన ఏడు త్రైమాసికాలతో పోలిస్తే మందగమనం. గడచిన ఏడాది ఇదే త్రైమాసికంలో ఆర్థికాభివృద్ధి 6.3 శాతంగా ఉంది. కాగా స్థూల విలువ ఆధారిత అభివృద్ధి సైతం 6.3 శాతం నుంచి 6 శాతానికి తగ్గే అవకాశాలున్నాయని ఆ అధ్యయన నివేదిక పేర్కొంది. కాగా రిజర్వు బ్యాంకు ప్రస్తుత సంవత్సరానికి సంబంధించిన రెండో నెలవారీ ద్రవ్య వినిమయ విధానాన్ని జూన్ 6న ప్రకటించనుంది. తాజా లోక్‌సభ ఎన్నికల అనంతరం తొలిసారిగా రిజర్వుబ్యాంకు ఈ సమావేశాన్ని నిర్వహించనుంది. దేశ ఆర్థికాభివృద్ధి తాజా గణాంకాలు వెల్లడైన తర్వాత రేట్ల కోతపై ఆర్బీఐ విధాన నిర్ణయం జూన్ 6న జరుగుతుందని, సుమారు 25 బేసిస్ పాయింట్ల మేర కొతవిధించి ఆ రేటును 5.75 శాతానికి పరిమితం చేసే అవకాశాలున్నాయని, ఇదే జరిగితే 2019లో మొత్తం 75 బేసిస్ పాయింట్ల కోత విధించినట్టవుతుందని నివేదిక స్పష్టం చేసింది. కాగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్థిక పరిశోధనా విభాగం నిర్వహించిన పరిశోధ తాలూకు నివేదిక ‘ఎకోవ్‌రాప్’ సైతం విడుదలైంది. ఆ మేరకు గడచిన మార్చితో ముగిసిన త్రైమాసికంలో దేశ స్థూల ఆర్థికాభివృద్థి 6.1 అని, జీవీఏ వృద్ధి 6 శాతం లేదా అంతకన్నా స్వల్ప శాతం తక్కువగా 5.9 శాతం కావచ్చని నివేదించింది. మొత్తానికి 2018-19లో జీడీపీ వృద్ధి 6.9 శాతం ఉంటుందని ఆ నివేదిక పేర్కొంది.
వృద్ధి మందగించే అవకాశాలున్నందున ఆర్బీఐ కొత్త ద్రవ్య వినిమయ విధానంలో సుమారు 35-50 బేసిస్ పాయింట్ల మేర రెపోరేట్లలో కోత అనివార్యమని ఆ నివేదిక పేర్కొంది. ఆర్బీఐ రేట్ల మార్పిడి కోసం బహుళ దృక్పథ రహిత విధానాన్ని అనురించి కనీసం 25 బేసిస్ పాయింట్ల మేర కోత విధించడం ద్వారా మార్కెట్‌కు భవిష్యత్తు సంకేతాలను పంపాలని ‘ఎకోరాప్’ అధ్యయన నివేదిక సూచించింది. ఈ సందర్భంగా కోటక్ మహేంద్ర వినియోగదారుల బ్యాంకింగ్ విభాగం అధ్యక్షుడు శాంతి ఏకాంబరం మాట్లాడుతూ ఎన్నికల ప్రక్రియ పూర్తవడం వల్ల ఇక అందరి దృష్టీ ఆర్థికాభివృద్ధిపై కేంద్రీకృతం అవుతుందని, అలాగే ద్రవ్య వినిమయం సైతం ప్రజల్లో వినియోగాన్ని పెంచి, తద్వారా పెట్టుబడులనూ పెంచేలా ఉండాలని ఆమె అభిప్రాయపడ్డారు. ప్రధానంగా రెపోరేట్ల కోత 25 నుంచి 50 బేసిక్ పాయింట్లు ఉండాలని సూచించారు. ఈ దిశలో వార్షిక ఆర్థికాభివృద్ధి, బడ్జెట్ అంచనాలను పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు.
అంతేకాకుండా అంతర్జాతీయ పరిస్థితులు, వాణిజ్య వొత్తిడులు, ముడి చమురు ధరల తీరు, భౌగోళిక రాజకీయ అంశాలు, రుతుపవనాల ప్రభావం వంటి అంశాలనూ పరిగణించాల్సిన అవసరం ఉందన్నారు. ఇలావుండగా రేటింగ్ ఏజెన్సీ ‘ఇక్రా’ ద్రవ్య వినిమయ విధాన కమిటీ 6న నిర్వహించనున్న సమావేశంలో ఎలాంటి మార్పులూ చేపట్టకపోవడమే మేలని సూచించింది. వేచిచూసే విధానాన్ని అనుసరించడం ద్వారా కేంద్ర బట్జెట్‌లో ప్రభుత్వ విధానాలను కూడా పరికించాలని సూచించింది.