బిజినెస్

2025 నాటికి ట్రిలియన్ డాలర్లకు చేరువలో భారత్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బీజింగ్: డిజిటల్ ఎకానమీలో 2025 నాటికి భారత్ ట్రిలియన్ డాలర్లకు చేరే అవకాశాలు బాగా ఉన్నట్లు వాణిజ్య మంత్రిత్వ శాఖ శుక్రవారం ఇక్కడ తెలియజేసింది. సేవల రంగంలో భారత్ ప్రాధాన్యాన్ని ఉటంకిస్తూ ఈ విధంగా పేర్కొంది. ఇండో-చైనా బిజినెస్ ఫోరంను ఉద్దేశించి భారత్ వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ డైరెక్టర్ సంగీత సక్సేనా ప్రసంగించారు. ఈ సందర్భంగా 560 మిలియన్ల ఇంటర్నెట్ వినియోగదారులతో పాటు చైనా తరువాత రెండో అతి పెద్ద మెసేజింగ్ సర్వీసులను భారత్ కలిగి ఉందని చెప్పారు. డిజిటల్ ఎకానమీలో ప్రపంచ వ్యాప్తంగా భారత్ మూడో స్థానంలో నిలిచిందని పేర్కొన్నారు. ఇది కాకుండా భారత్ వ్యాప్తంగా యూఐడీఏఐ కింద 1.2 బిలియన్ల మంది ఆధార్ కార్డులను పొందారని స్పష్టం చేశారు. సేవల రంగంలో 2025 నాటికి ఒక ట్రిలియన్ డాలర్ల డిజిటల్ ఎకానమీకి భారత్‌లో అవకాశాలు చాలా ఉన్నాయని చెప్పారు. సేవల రంగంతో పాటు ఐటీ, ఎలక్ట్రానిక్స్ రంగాలతో పాటు విద్య, ఇంధనం, ఆర్థిక, హెల్త్‌కేర్, లాజిస్టిక్స్, రవాణా రంగాల్లో కూడా భారత్‌లో అవకాశాలు బాగా పెరిగాయని అన్నారు. ఈ నేపథ్యంలోనే భారత్ డిజిటల్ ఎకానమీ 2025 నాటికి ట్రిలియన్ డాలర్లకు చేరుతుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కారణంగానే చైనా సహా అనేక దేశాలకు చెందిన పెట్టుబడిదారులకు భారత్‌లో అవకాశాలు ఉన్నాయని చెప్పారు. స్థూలంగా 62 శాతం సేవా రంగానికే అవకాశాలు ఎక్కువ ఉన్నట్లు సంగీత సక్సేనా చెప్పారు. 50 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ) సేవా రంగానికి రానున్నట్లు పేర్కొన్నారు.