బిజినెస్

భారత్‌లో వాణిజ్యాన్ని మరింత విస్తరిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 2: భారత్‌లో తమ కంపెనీ వాణిజ్యం ప్రగతిపథంలో సాగుతోందని, వచ్చే పదేళ్ల కాలంలో తమ కంపెనీ మొత్తం అంతర్జాతీయ ఆదాయంలో భారత్ నుంచి 10 శాతంగా ఉండే అవకాశాలున్నాయన్న విశ్వాసాన్ని అమెరికన్ సాంకేతిక దిగ్గజం ‘సీస్కో’ వ్యక్తం చేస్తోంది. నెట్‌వర్క్ సమస్యల పరిష్కార సేవలందించే సిస్కో మన దేశంలోని పలు ప్రభుత్వ ప్రాజెక్టులను నిర్వహిస్తోంది.
ప్రధాన మార్కెట్లలో సుమారు 10 వేల మందితో కూడిన కార్మిక వ్యవస్థను కలిగివుంది. భారతీయ మార్కెట్లు గణనీయమైన, స్థిరమైన ప్రగతి సాధిస్తున్నాయని అందుకే ఇక్కడ తమ వాణిజ్య కార్యకలాపాలను విస్తరిస్తున్నామని ఆ కంపెనీ సీఈవో చుక్ రాబిన్స్ ఆదివారం నాడిక్కడ పీటీఐతో మాట్లాడుతూ పేర్కొన్నారు. తమ టీమ్‌లు మంచి పని సమర్థతను ప్రదర్శించాయన్నారు. భారత్‌లో నెలకొన్న స్థినమైన రాజకీయ పరిస్థితులు, సాంకేతికతపై ప్రజలకున్న నమ్మకం వల్ల తమ కంపెనీకి ఇక్కడ వాణిజ్యాన్ని విస్తరించాలన్న దృఢ నిశ్చయం కలిగించాయని ఆయన చెప్పారు. ఆగస్టు, జూలై ఆర్థిక వరకు ఆర్థిక సంవత్సర పనితీరును బేరీజువేసే ఈ కంపెనీ మూడో త్రైమాసికంలో 13 బిలియన్ డాలర్ల ఆదాయం రావచ్చన్న అంచనా వేస్తోంది.
ఇందులో అమెరికాలో 7.6 బిలియన్లు, ఐరోపా, మధ్య, తూర్పు, ఆఫ్రికా దేశాల ఆదాయం 3.3 బిలియన్ డాలర్లు, ఆసియా పసిఫిక్, చైనా, జపాన్ ప్రాంతాల నుంచి 1.9 బిలియన్ డాలర్లు సమకూరుతుందని అంచనా వేస్తోంది.