బిజినెస్

లక్ష్యం రూ. 50 వేల కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: దేశవ్యాప్తంగా సింగరేణి బొగ్గు అవసరాలు రోజురోజుకు గణనీయంగా పెరుగుతున్నందన రాబోవు రోజుల్లో ఉత్పత్తి, అమ్మకాలు రూ. 50 వేల కోట్లు లక్ష్యంగా ముందుకు సాగాలని సింగరేణి సీఎండీ శ్రీ్ధర్ సూచించారు. ఆదివారం హైదరాబాద్ సింగరేణి కేంద్ర కార్యాలయంలో తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన సింగరేణి ఉద్యోగులనుద్దేశించి మాట్లాడుతూ దేశంలో బొగ్గు అవసరాలు దృష్ట్యా సింగరేణి సంస్థను ఆర్థికంగా ప్రోత్సహించడానికి యావత్ సిబ్బంది నిరంతరం పని చేయాల్సి ఉంటుందని ఆయన గుర్తు చేశారు. 2014- 2015 నుంచి సింగరేణి బొగ్గు ఉత్పత్తిలో గణనీయంగా అభివృద్ధి సాధించామన్నారు. సింగరేణి వృద్ధిరేటు అమాంతంగా పెరుగుతున్నదన్నారు. దేశంలో ఉన్న 8 మహారత్న కంపెనీలకు దీటుగా సింగరేణికి పేరు వచ్చిందన్నారు. మహారత్న కంపెనీలు 146 శాతం వృద్ధి సాధిస్తే సింగరేణి మాత్రం 282 శాతం వృద్ధి సాధించడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. దేశంలో కోలిండియా 55 శాతం సాధించగా, సింగరేణి దీనికి రెట్టింపుగా 116.5 శాతం వృద్ధిని నమోదు చేసుకుందన్నారు. సింగరేణి లాభాలు అమ్మకాల్లోనే కాదు సంక్షేమంలో కూడా దేశంలోని ఏ ప్రభుత్వ రంగ సంస్థకూ తీసిపోని విధంగా అనేక పథకాలు అమలు చేస్తోందన్నారు. సింగరేణి బొగ్గు ఉత్పత్తి కాకుండా సింగరేణి థర్మల్ విద్యుత్‌తో దేశంలోని కరంటు లోటు తీర్చనన్నదన్నారు. సింగరేణి విద్యుత్ థర్మల్ కేంద్ర ద్వారా 22,500 మిలియన్ యూనిట్లను తెలంగాణ విద్యుత్ అవసరాలను తీర్చిందన్నారు. త్వరలో మరో 300 మెగావాట్ల సోలార్ విద్యుత్‌ను ఉత్పత్తిని చేయడానికి పనులు శరవేగంగా జరుగుతున్నాయని గుర్తు చేశారు.
2019-2020 ఆర్థిక సంవత్సరంలో 700 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు ఉత్పిత్తిని సాధించాలన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవతో సింగరేణి కొత్తగా చేపడుతున్న బొగ్గు గనులు ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నట్లుగా చెప్పారు. కొత్తగా ఒరిస్సా, చత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో కొత్త బ్లాకుల్లో బొగ్గు ఉత్పత్తి ప్రారంభించనున్నామని ఆయన గుర్తు చేశారు. పనితీరులో ఉత్తమ ప్రతిభ కన్పర్చిన ఉద్యోగులను సీఎండీ శ్రీ్ధర్ సన్మానించారు. కాగా, తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాల సందర్భంగా వివిధ క్రీడల్లో గెలుపొందిన వారికి జీఎం ఆంటోనిరాజా అధికారులకు బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో సింగరేణి సంస్థ ఈడీ జె ఆల్విన్, డిఎన్ ప్రసాద్, నరసింహ్మామూర్తితో పాటు వివిధ విభాగాలకు చెందిన సీనియర్ అధికారులు పాల్గొన్నారు. తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాలు యావత్ సింగరేణి బొగ్గు గనుల్లో ఘనంగా నిర్వహించారని సంస్థ పీఆర్వో మహేష్ తెలిపారు.
చిత్రం...తెలంగాణ ఆవిర్భావోత్సవాలలో భాగంగా హైదరాబాద్‌లో ఉద్యోగులను సన్మానిస్తున్న సింగరేణి సీఎండీ శ్రీ్ధర్