బిజినెస్

మళ్లీ జీవిత కాల గరిష్టానికి సూచీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జూన్ 3: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం మళ్లీ జీవితకాల గరిష్టాలను తాకాయి. బీఎస్‌ఈలో సెనె్సక్స్ 553 పాయింట్లు లాభపడగా, ఎన్‌ఎస్‌ఈలో నిఫ్టీ సైతం 166 పాయింట్లు ఎగబాకింది. ఓ వైపు బలహీన జీడీపీ గణాంకాలు ఉన్నా తదుపరి రిజర్వుబ్యాంకు రెపో రేట్ల కోత విధిస్తుందన్న అంచనాల క్రమంలో మదుపర్లు పెద్దయెత్తున వాటాలు కొనుగోళ్లు చేశారు. 30 షేర్ల సెనె్సక్స్ ఇంట్రాడేలో ఆల్‌టైం రికార్డు గరిష్టం 40,308.90 పాయింట్లకు చేరగా, 50 షేర్ల సూచీ నిఫ్టీ తన జీవిత కాల గరిష్టం 12,103.05 పాయింట్లకు చేరింది. బీఎస్‌ఈ సూచీ సెనె్సక్స్ ఓ దశలో 598 పాయింట్లు ఎగబాకి చివరికి 553.42 పాయింట్ల వద్ద స్థిరపడింది. కాగా సెనె్సక్స్ ప్యాక్‌లో హీరో మోటోకార్ప్, బజాజ్ ఆటో, ఏసియన్ పెయింట్స్, ఇండస్ ఇండ్ బ్యాంక్, హెచ్‌యూఎల్, మారుతి అత్యధికంగా 5.87 శాతం లాభపడ్డాయి. ఐతే ఐసీఐసీఐ బ్యాంకు, ఎన్‌టీపీసీ, ఐటీసీ 0.13 శాతం నష్టపోయాయి. ఈ వారం ఆర్బీఐ రెపోరేట్ల కోత విధిస్తుందన్న అంచనాలే మార్కెట్లకు ఊతమిచ్చాయని వ్యాపారవేత్తలు చెప్పారు. మార్చితో ముగిసిన త్రైమాసికంలో దేశ ఆర్థికాభివృద్ధి ఐదేళ్ల కనిష్టం 5.8 శాతానికి చేరిన సంగతి తెలిసిందే. వివిధ రంగాల పనితీరు సన్నగిల్లడం, ప్రధానంగా తయారీ రంగం పనితీరు మరీ అధ్వాన్నంగా ఉండటం ఆర్థికాభివృద్ధికి అవరోధంగా మారిందని విశే్లషకులు భావిస్తుండగా ఈ క్రమంలో ఆర్బీఐ మరో దఫా రెపోరేట్ల కోత విధించక తప్పదన్న నిశ్చితాభిప్రాయం నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. వచ్చే గురువారం ఆర్బీఐ ద్రవ్య వినిమయ విధాన కమిటీ (ఎంపీసీ) నెలవారీ సమావేశం జరుగనునుంది. ఈ సందర్భంగా సెంట్రల్ బ్యాంకు రెపోరేట్లలో 25 బేసిస్ పాయింట్ల మేర కోత విధించవచ్చని ఆర్థిక నిపుణుల అంచనా. దీం తో మదుపర్లలో సానుకూల దృక్పథం నెలకొంది.
బలపడిన రూపాయి
బలపడిన రూపాయి మారకం విలువ సైతం మదుపర్లలో సానుకూలతను పెంచిందని అంటున్నారు. సోమవారం అమెరికన్ డాలర్‌తో 38 పైసలు పెరిగిన రూపాయి విలువ రూ.69.32గాట్రేడైంది. ఇక ఆసియా దేశాల మార్కెట్లు సోమవారం మిశ్రమ ఫలితాలనే నమోదు చేశాయి. ఇక ఐరోపా మార్కెట్లు ఆరంభ ట్రేడింగ్‌లో నష్టాలను నమోదు చేశాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు 0.39 శాతం పెరిగి బ్యారెల్ 62.23 డాలర్లు పలికింది.