బిజినెస్

భూములకు పరిహారం చెల్లించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 3: సింగరేణి ఏరియాలో కొత్త గనుల కోసం సేకరించిన భూములకు నష్టపరిహరం చెల్లించే విషయంలో తక్షణ చర్యలు తీసుకోవాలని సంస్థ సీఎండీ శ్రీ్ధర్ జనరల్ మేనేజర్లను ఆదేశించారు. సోమవారం సింగరేణి భవన్‌లో ఏరియా మేనేజర్లతో జరిగిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. రానున్న వర్షాకాలంలో బొగ్గు ఉత్పిత్తికి ఎలాంటి ఆటంకాలు లేకుండా ముందస్తు జాగ్రతలు చేపట్టాలని ఆయన సూచించారు. నెలవారీ లక్ష్యాల సాధనపై మేనేజర్లు, డైరెక్టర్ల నుంచి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా ఓవర్ బర్డెన్ తొలగింపుపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. కొత్తగనుల ప్రారంభానికి 3 నెలలు ముందే ఓబీ కాంట్రాక్టులను అప్పగించాలని, వాటిని వెంటనే అమలు చేయాలని ఆయన ఆదేశించారు. కొత్త గనులకు సంబంధించిన నష్టపరిహారం చెల్లింపులో కంపెనీ నుంచి ఎలాంటి జాప్యం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కొత్త గనుల్లో అనుకున్న సమయానికి బొగ్గు ఉత్పిత్తి జరగాలని ఆయన ఆదేశించారు. బొగ్గు నాణ్యత పడిపోతే పెనాల్టీలు చెల్లించాల్సి వస్తుందన్నారు.
చిత్రం...సింగరేణి భవనంలో ఏరియా మేనేజర్లు, డైరెక్టర్లతో చర్చిస్తున్న సింగరేణి సీఎండీ శ్రీ్ధర్