బిజినెస్

శ్రీగంధం సాగుతో మంచి లాభాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్ : శ్రీగంథం, వెదురు, టేకు, సరుగుడు తదితర చెట్లను పెంచడం వల్ల రైతులకు మంచిలాభాలు వస్తాయని వ్యవసాయ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు. శ్రీగంథం తదితర మొక్కలు, చెట్లు పెంచడంపై రైతులకు అవగాహన కల్పించేందుకు సోమవారం ఇక్కడి ఉద్యాన శిక్షణా సంస్థలో ఒకరోజు అవగాహనా సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, సాంప్రదాయ పంటలతోపాటు లాభాలను ఇచ్చే వాణిజ్య తదితర పంటలు, వ్యవసాయ అనుబంధ రంగాలపై రైతులు దృష్టి కేంద్రీకరించాలని సూచించారు. రైతుల సంక్షేమం కోసం రైతుబంధు, ఉచిత విద్యుత్, రుణమాఫీ తదితర పథకాలను తమ ప్రభుత్వం చేపట్టిందన్నారు. మన రాష్ట్రంలో శ్రీగంథం సాగుకు వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయన్నారు. ఆగ్రోఫారెస్ట్రీ పంటలతో పాటు సుగంధ మొక్కలను ప్రోత్సహించేందుకు తమ ప్రభుత్వం ఒక్కో జిల్లాలో 100 ఎకరాల భూములను పైలట్ ప్రాజెక్టు కింద చేపట్టాలని ప్రతిపాదనలు సిద్ధం చేసిందని మంత్రి వివరించారు. శ్రీగంథం సాగుచేస్తున్న రైతుల పూర్తి సమాచారాన్ని సేకరించాలని మంత్రి ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో ఉద్యాన శాఖ కమిషనర్ ఎల్. వెంకట్రామ్‌రెడ్డి, అటవీ శాఖ అడిషనల్ పీసీసీఎఫ్ దోబ్రియాల్, శాస్తవ్రేత్తలు తదితరులు ఈ కార్యక్రమంలో మాట్లాడారు. తెలంగాణతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుండి దాదాపు 400 మంది రైతులు అవగాహనా సదస్సులో పాల్గొన్నారు.
చిత్రం...సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి నిరంజన్ రెడ్డి