బిజినెస్

యూఏఈ లాటరీలో భారతీయునికి జాక్‌పాట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దుబాయ్, జూన్ 4: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏ ఈ)లోని ఒక భారతీయుడికి 2.7 మిలియన్ డాలర్ల లాటరీ రూపంలో అదృష్టలక్ష్మి తలుపు తట్టింది. యూఏఈ మీడియా కథనం ప్రకారం...అక్కడ నివసిస్తున్న సంజయ్ నాథ్ ఆర్ అనే భారతీయుడి అబుదాబీలో కొంతకాలం కిందట ‘బిగ్ టికెట్’ పేరిట ఒక లాటరీ టికెట్ కొన్నాడు. ఇపుడు అదే టికెట్‌కు అదృష్టలక్ష్మి వరించింది. సోమవారంనాడు లాటరీ ఫలితాలు ప్రకటించగా బంపర్ ప్రైజు కింద సంజయ్ నాథ్ ఆర్‌కు 10 మిలియన్ దిర్‌హామ్ (2.7 మిలియన్ డాలర్లు) దక్కినట్టు ఖలీజ్ టైమ్స్ అనే దినపత్రిక మంగళవారంనాడు వెల్లడించింది. సంజయ్ నాథ్ ఈ లాటరీలో ఫస్ట్ ప్రైజును దక్కించుకోగా, మిగిలిన టాప్ 10 ప్రైజ్‌లు పొందినవారిలో మరో ఐదుగురు భారతీయులు కూడా ఉండడం విశేషం. ఈ లాటరీలో రెండో ప్రైజ్ కింద 100,000 దిర్‌హామ్స్‌ను బినూ గోపీనాథన్ అనే భారతీయుడు దక్కించుకున్నాడు. అదేవిధంగా షిపాక్ బారువా అనే బంగ్లాదేశీయుడు అత్యంత ఖరీదైన లగ్జరీ కారు ల్యాండ్ రోవర్ సిరీస్-16ను కైవసం చేసుకున్నాడు. ఇదిలావుండగా, గత నెలలో జరిగిన ‘బిగ్ టికెట్’ లాటరీలో ఫస్ట్ ప్రైజ్‌ను షార్జాలో స్థిరపడిన ఒక భారతీయుడు గెలుపొందాడు. ఈ ప్రైజ్ మనీ కింద షార్జాకు చెందిన షోజిత్ కేఎస్‌కు 15 మిలియన్ దిర్‌హామ్స్ (4.08 మిలియన్ డాలర్లు) దక్కాయి.