బిజినెస్

కోలుకున్న ఆసియా మార్కెట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హాంకాంగ్, జూన్ 5: వడ్డీ రేట్లను తగ్గిస్తున్నట్టు అమెరికా ఫెడరల్ రిజర్వు పరోక్ష సంకేతాలు ఇవ్వడంతో బుధవారం ఆసియా స్టాక్ మార్కెట్ కోలుకోవవడమే కాకుండా లాభాల్లో నిలిచాయి. ఫెడరల్ రిజర్వు చేపడుతున్న పలు చర్యలు ఇటీవల కాలంలో ప్రపంచ వ్యాప్తంగా స్టాక్ మార్కెట్‌లో ప్రభావం చూపుతున్న విషయం తెలిసిందే. ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న వడ్డీ రేట్ల తగ్గింపుపై త్వరలోనే ఒక నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉన్నట్టు సమాచారం. ఈ వార్త వెలువడిన వెంటనే ఆసియా మార్కెట్లు లాభాలను ఆర్జించాయి. టోక్యోలో 1.8, హాంకాంగ్‌లో 0.5, సియోల్‌లో 0.1, చైనీస్ తైపీలో 0.3 శాతం చొప్పున లాభాలు నమోదయ్యాయి. షాంఘై మార్కెట్ మాత్రం అటు లాభంగానీ, ఇటు నష్టం గానీ లేకుండా స్థిరంగా కొనసాగింది. కాగా, ఫెడరల్ రిజర్వు వడ్డీ రేట్లను రికార్డు స్థాయిలో 1.25 శాతం వరకు తగ్గించే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది.