బిజినెస్

ముంబయి-పూణే మధ్య వందే భారత్ రైలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాసిక్, జూన్ 5: న్యూఢిల్లీ-వారణాసి మధ్య ప్రవేశపెట్టిన వందే భారత్ ఎక్స్‌ప్రెస్ సర్వీస్ విజయవంతం కావడంతో అదే తరహాలో మరికొన్ని రైళ్లను నడిపేందుకు రైల్వే శాఖ సన్నాహాలు చేస్తోంది. అందులో భాగంగానే ముంబయి నుంచి పుణే వరకు వందే భారత్ తరహా రైలును నడపనున్నది. నాసిక్-వడోదర మధ్య కూడా మరో రైలు నడిపేందుకు ప్రయత్నం చేస్తోంది. ఈ ప్రయత్నాలు సఫలమైతే వచ్చే వారంలోనే ఈ ప్రత్యేక రైలు సర్వీసులు మొదలవుతాయి. మొదట ముంబయి నుంచి పుణే వరకు లేదా ముంబయి నుంచి నాసిక్ వరకు లేదా ముంబయి నుంచి వడోదర వరకు ట్రయల్ రన్ వచ్చే వారం ఉండవచ్చునని రైల్వే బోర్డు సభ్యుడు రాజేష్ అగర్వాల్ తెలిపారు. వందే భారత్ రైలు సర్వీసు విధానంలోనే ఈ కొత్త రైళ్లు ఉంటాయని ఆయన తెలిపారు. ఒక ఏసీ, మరొక నాన్ ఏసీ బోగీలు ఉంటాయని, వీటిని సెంట్రల్, వెస్ట్రన్ రైల్వే నిర్వహిస్తాయని ఆయన పేర్కొన్నారు. వందే భారత్ సర్వీసులకు ఆదరణ పెరగడంతో మిగతా ప్రాంతాల్లోనూ అలాంటి ప్రయత్నాలే జరిగే అవకాశం ఉందని ఆయన తెలిపారు.