బిజినెస్

మొండి బకాయిలపై కొత్త మార్గదర్శకాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జూన్ 6: మొండి రుణ బకాయిలు, నిరర్ధక ఆస్తులకు సంబంధించి రిజర్వు బ్యాంకు సరికొత్త మార్గదర్శకాలను రూపొందించింది. మూడు లేదా నాలుగు రోజుల్లో వాటిని విడుదల చేయనుందని ఆ బ్యాంకు గవర్నర్ శక్తికాంత దాస్ గురువారం నాడిక్కడ తెలిపారు. గత ఏడాది ఫిబ్రవరి 2న ఈ విషయమై ఆర్బీఐ జారీ చేసిన సర్క్యులర్‌ను ఏప్రిల్ 2న సుప్రీం కోర్టు రద్దు చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. మూడోసారి రెపోరేట్ల కోత విధించిన ఎంపీసీ సమావేశానంతరం ఆయన విలేఖరులతో మాట్లాడారు. అనేక న్యాయపరమైన అంశాలను, పలువురు వాటాదారుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని తాజా మార్గదర్శకాలను రూపొందించామన్నారు. గత ఫిబ్రవరి 12న విడుదల చేసిన మార్గదర్శకాల మేరకు బ్యాంకులు ఒక రోజు వ్యవధిలోనే డీఫాల్టర్లను ప్రకటించి 180 రోజుల్లోగా పరిష్కార ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. రూ. 2000 కోట్లు ఆ పైన ఉన్న మొండి రుణ బకాయిలకు సంబంధించిన కేసులను బ్యాంకులను మోసగించిన కేసులుగా పరిగణించాల్సి ఉంటుంది.
ఈక్రమంలో ఈ సర్క్యులర్‌పై పలు విద్యుత్ ఉత్పాదక కంపెనీలు అభ్యంతరం తెలిపి న్యాయ స్థానాన్ని ఆశ్రయించిన విషయాన్ని శక్తికాంత దాస్ గుర్తు చేశారు. ప్రభుత్వం తమకు కావలసినంత ఇంధనాన్ని సరఫరా చేయకపోవడం, కొన్ని కోల్ బ్లాకులను రద్దు చేయడం వంటి చర్యలకు పాల్పడి తమను నష్టాల పాలు చేసిందని, ఆలాగే ప్రభుత్వ రంగ డిస్కాంలు సైతం చెల్లింపులు చేయకపోవడం వల్ల తాము మొత్తంగా 5.65 లక్షల కోట్ల రుణ బకాయిలు పడ్డామని వాదించాయని గుర్తు చేశారు. ఈ అంశాలన్నీ పరిగణనలోకి తీసుకుని సరికొత్త మార్గదర్శకాలను రూపొందించామని ఆర్బీఐ గవర్నర్ స్పష్టం చేశారు.