బిజినెస్

క్లెయిమ్ నిరాకరణ కుదరదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 6: బీమా చేసుకోవడానికి ముందే సదరు వ్యక్తి వ్యాధి కలిగి ఉన్నాడనే అనుమానంతో అతడి క్లెయిమ్‌ను బీమా కంపెనీ నిరాకరించజాలదని నేషనల్ కన్స్యూమర్ డిస్పూట్స్ రిడ్రెసల్ కమిషన్ (ఎన్‌సీడీఆర్‌సీ) స్పష్టం చేసింది. ఒకవేళ బీమా చేయించుకోవడానికి ముందే ఒక వ్యక్తి వ్యాధి కలిగి ఉన్నప్పటికీ అతడికి ఆ విషయం తెలిసి ఉండకపోతే, ఆ వ్యాధికి చికిత్స తీసుకొని ఉండకపోతే అతడి క్లెయిమ్‌ను బీమా కంపెనీ నిరాకరించజాలదని ఎన్‌సీడీఆర్‌సీ పేర్కొంది. మహారాష్ట్ర స్టేట్ కమిషన్ జారీ చేసిన ఆదేశాలను సవాలు చేస్తూ రిలయన్స్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ దాఖలు చేసిన రివిజన్ పిటిషన్‌ను తోసిపుచ్చుతూ ఎన్‌సీడీఆర్‌సీ ఈ వ్యాఖ్యలు చేసింది. డయాబెటిక్ కీటోఅసిడోసిస్‌తో చనిపోయిన ఒక పాలసీ హోల్డర్ భర్తకు రూ. 1,12,500 చెల్లించాల్సిందిగా జిల్లా ఫోరం జారీ చేసిన ఆదేశాలను సవాలు చేస్తూ రిలయన్స్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ చేసిన అప్పీల్‌ను తోసిపుచ్చుతూ ఇదివరకే మహారాష్ట్ర స్టేట్ కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. రిలయన్స్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్‌కు వ్యతిరేకంగా ఫిర్యాదు చేసిన పాలసీ హోల్డర్ భర్తకు కలిగిన శారీరక, మానసిక ఇబ్బందులకు గాను రూ. అయిదు వేలు, వ్యాజ్యం వ్యయం కింద రూ. మూడు వేలు చెల్లించాలని కూడా జిల్లా ఫోరం రిలయన్స్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్‌ను ఆదేశించింది. రిలయన్స్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ దాఖలు చేసిన రివిజన్ పిటిషన్‌ను తోసిపుచ్చుతూ, బీమా చేయించుకోవడానికి ముందే సదరు వ్యక్తికి వ్యాధి ఉందని నిరూపించాల్సిన బాధ్యత బీమా కంపెనీదే అని కూడా ఎన్‌సీడీఆర్‌సీ స్పష్టం చేసింది.