బిజినెస్

ఐదేళ్ల కనిష్టానికి వడ్డీరేట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జూన్ 6: దేశ ఆర్థిక స్థితిని బలోపేతం చేసే దృక్పథంతో రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా గురువారం రెపోరేట్లలో మరోమారు కోత విధించడం ద్వారా రుణాలపై వడ్డీ రేట్ల శాతాన్ని తొమ్మిదేళ్ల కనిష్టం 5.75 శాతానికి తగ్గించివేసింది. తద్వారా ద్రవ్య వినిమయ విధానంలో మార్పులు చేసింది. ప్రత్యేకించి సర్ధుబాట్లకు, భవిష్యత్తులో రేట్ల కోతకు అవకాశం కల్పించింది. వరుసగా గడచిన ఐదు నెలల కాలంలో మూడుమార్లు వడ్డీరేట్లపై కోత విధించడం వల్ల గృహ, వాహన రుణాల నెలవారీ వాయిదాల చెల్లింపులు తగ్గించాలని, అలాగే కంపెనీలపై ఉన్న రుణాల చెల్లింపు భారాన్ని తగ్గించాలని ఆర్బీఐ భావిస్తోంది. ఇప్పటి వరకు మూడు దఫాలుగా రెపోరేట్ల కోత ద్వారా మొత్తం 0.75 శాతం వడ్డీ రేట్లను తగ్గించింది. ఇందులో భాగంగానే తాజాగా గురువారం 0.25 పర్సంటేజి పాయింట్లు కోత విధించింది. దీంతో గతంలో ఊహించిన మేరకు రుణాలపై వడ్డీ రేటు 5.75 శాతానికి పడిపోయింది. గతంలో 2010 జూలైలో ఇలా వడ్డీ 5.75 శాతంగా ఉండేది. అలాగే ఎల్‌ఏఎఫ్ స్థాయిననుసరించి రివర్స్ రెపోరేట్లను 5.50 శాతానికి తగ్గించడం జరిగింది. స్వల్పస్థాయి స్టాండింగ్ సదుపాయాలు (ఎంఎస్‌ఎఫ్) రేట్లు, బ్యాంక్ రేట్లను 6.0 శాతానికి సర్దుబాటు చేశారు. గురువారం జరిగిన ఆరుగురు సభ్యులతో కూడిన ఆర్బీఐ ద్రవ్య వినిమయ విధాన కమిటీ (ఎంపీసీ) సమావేశం జీడీపీ వృద్ధి అంచనాలను 7 శాతానికి తగ్గించింది. ఇప్పటి వరకు ఈ గణాంకాలు 7.2 శాతంగా ఉండేవి. అలాగే 2019-20 ఆర్థిక సంవత్సరం ప్రథమార్థ ద్రవ్యోల్బణ అంచనాలను స్వల్పంగా 3 నుంచి 3.1 శాతానికి పెంచింది. అంటే సంతృప్తికర ద్రవ్యోల్బణ పరిమితి 2 నుంచి 6 శాతం కాగా దానికన్నా తక్కువగా ద్రవ్యోల్బణం ఉండేలా ఆర్బీఐ జాగ్రత్త పడింది. కాగా దేశంలో పెట్టుబడుల ప్రక్రియలో సైతం కొంత మందగమనాన్ని ఆర్బీఐ గుర్తించింది. అలాగే ప్రైవేటు ఉత్పత్తుల వినియోగంలో వృద్ధిని సైతం అంచనా వేసింది. వీటి ఆధారంగానే ఏకగ్రీవంగా తాజా ద్రవ్య వినిమయ విధాన తీర్మానం చేసినట్టు ఆర్బీఐ తెలిపింది. అలాగే గతంలో విధించిన రెండు రెపోరేట్ల కోతల తర్వాత నెలకొన్న పరిస్థితులను సైతం ఎంపీసీ పరిగణనలోకి తీసుకున్నట్టు తెలిపింది. ప్రైవేటు పెట్టుబడులకు ఊతమిచ్చి ఆర్థికాభివృద్ధికి తోడ్పడాలన్నదే అంతిమ లక్ష్యమని, అలాగే ద్రవ్యోల్బణ నియంత్రపై సైతం ఈదఫా ఎంపీసీ ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించిందని ఆర్బీఐ వివరించింది. ప్రస్తుతం దేశంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులు, వినియ సామర్థ్యం, స్టాక్ మార్కెట్ల తీరును నిశితంగా పరిశీలించి రానున్న త్రైమాసికంలో వాణిజ్యంలో వృద్ధి నెలకొనేలా తాజా విధానం నిర్ణయం చేసినట్టు తెలిపింది.