బిజినెస్

ఉపాధి అవకాశాలను విస్తృతం చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 9: సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల (ఎంఎస్‌ఎంఈ) స్థాపన, అభివృద్ధిని ప్రోత్సహించాలని, తద్వారా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఉపాధి అవకాశాల విస్తృతికి అవకాశాలు ఏర్పడతాయని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖల మంత్రి పీయూష్ గోయల్ పేర్కొన్నారు. జపాన్‌లో జీ-20 దేశాల ఆర్థిక, వాణిజ్య మంత్రుల శిఖరాగ్ర సదస్సులో ఆదివారం నాడాయన ‘వాణిజ్యం, పెట్టుబడుల అభివృద్ధికి ఊతం, తద్వారా నిలకడైన అభివృద్ధి’ అనే అంశంపై ప్రసంగించారు. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఆర్థికాభివృద్ధి జరగాలంటే తొలుత ఉపాధి అవకాశాలను విస్తృతం చేయాలని, అలాగే వాణిజ్యాన్ని స్థిరంగా అభివృద్ధి చేయాలని అభిప్రాయపడ్డారు. ఎంఎస్‌ఎంఈలను ప్రోత్సహించడం ఇందుకు బాగా తోడ్పడుతుందని, అంతేకాక దేశ ఆదాయ అభివృద్ధి సైతం జరుగుతుందని అన్నారు. అలాగే అభివృద్ధి స్థిరంగా సాగాలంటే స్వేచ్ఛాయుత వాణిజ్య విధానం, పెట్టుబడులు అవసరమన్నారు. ఈ విషయంలో అవగాహన లోపించడం వల్లే అనేక దేశాల మధ్య వైరుధ్యాలు తలెత్తుతున్నాయన్నారు. ప్రస్తుతం అనేక దేశాలు అంతర్జాతీయ వాణిజ్య విధానంతో పూర్తిస్థాయిలో సమర్థవంతంగా సమ్మిళితమయ్యేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని గోయల్ పేర్కొన్నారు. అలాగే ఆర్థిక, మానవ వనరులకు కీలక బంధాలు ఉండేలా చూస్తే వాణిజ్యానికి, పెట్టుబడులకు ఊతం, స్థిరమైన వృద్ధి చేకూరుతాయని సూచించారు. భారత దేశ ఎగుమతుల్లో 45 శాతం సూక్ష్మ, చిన్న, మధ్య తరహా మరిశ్రమలు (ఎంఎస్‌ఎంఈ) ద్వారానే జరుగుతున్నాయన్నారు. జీడీపీలో 25 శాతం సేవా రంగం ద్వారా, 33 శాతం తయారీ రంగం ద్వారా జరుగుతోందని మంత్రి గోయల్ వివరించారు. ఇలావుండగా ఈ సదస్సులో గోయల్ వివిధ దేశాల వాణిజ్య మంత్రులతో విడివిడిగా సమావేశాలు నిర్వహించి ద్వైపాక్షిక వాణిజ్య బంధాలపై చర్చలు జరిపారు. ప్రదానంగా బ్రిటన్, జపాన్, స్పెయిన్, కొరియా, దక్షిణ కొరియా దేశాల వాణిజ్య మంత్రులతో గోయల్ కీలక చర్చలు జరిపారు, వాణిజ్య విస్తృతి, పెట్టుబడుల పెంపుపై ఈ సందర్భంగా పలు ఒప్పందాలు కుదిరాయి. బ్రిటన్‌కు చెందిన అంతర్జాతీయ వాణిజ్య వ్యవహారాల శాఖ కార్యదర్శి లియామ్ ఫాక్స్‌తో జరిపిన జర్చల సారాంశాన్ని పీయూష్ గోయల్ ట్విట్టర్‌లో పొందుపరిచారు. భవిష్యత్తులో మరింత బలమైన వాణిజ్య బంధాన్ని కొనసాగించాలని ఈ సందర్భం గా నిర్ణయించామని గోయల్ పేర్కొన్నారు. మరిన్ని సదుపాయాలతో కూడిన వాణిజ్యం, పెట్టుబడుల అవకాశాలపై ప్రధానంగా చర్చించామని తెలిపారు. అలాగే జపాన్‌తో ‘మెగా వాణిజ్య ఒప్పందం’కు సంబంధించిన ప్రతిపాదనలు, ప్రాంతీయంగా సమగ్ర ఆర్థిక భాగస్వామ్యం (ఆర్‌సీఈపీ) అంశంపైనా చర్చలు జరిపామని మంత్రి తెలిపారు.