బిజినెస్

సింగరేణిలో కొలువుల జాతర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: సింగరేణి బొగ్గు గనుల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీ కోసం ఏటా కొలువుల జాతర ఉంటుందని సింగరేణి సీఎండీ శ్రీ్ధర్ అన్నారు. పెద్ద సంఖ్యలో యువకుల చేరికతో బొగ్గు ఉత్పత్తి గణనీయంగా పెరుగుతోందన్నారు. తెలంగాణ ఆవిర్భావం నుంచి ఇప్పటికి 10,446 వేల ఉద్యోగాలను భర్తీ చేశామన్నారు. బొగ్గు ఉత్పత్తి, అమ్మకాలు, లాభాలతో సింగరేణి సంస్థ దేశవిదేశాల్లో ప్రత్యేక స్థానం దక్కించుకుందన్నారు. సింగరేణిలో ప్రత్యక్ష, పరోక్షంగా ఉద్యోగాల భర్తీ కొనసాగుతుందన్నారు. సింగరేణిలో అనారోగ్య కారణాలతో ఉద్యోగం చేయలేని ఉద్యోగులకు కుటుంబాలకు సింగరేణి అండగా ఉంటోందన్నారు. ఉద్యోగం చేయలేని కార్మికుల స్థానంలో వారు సూచించిన వారసులకు ఉద్యోగం కల్పిస్తామన్నారు. సింగరేణిలో కారుణ్య నియామకం వచ్చే రోజుల్లో మరింత ఎక్కవ మందికి అవకాశం కల్పిస్తుందన్నారు.