ఆంధ్రప్రదేశ్‌

అవినీతి రహిత పాలన అందిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (ఎడ్యుకేషన్), జూన్ 14: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కుటుంబ పెద్దగా పేద ప్రజలకు అండగా ఉంటారని, అభివృద్ధి, సంక్షేమంతో కూడిన అవినీతి రహిత పాలన అందిస్తామని మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. శుక్రవారం అసెంబ్లీ మీడియా పాయింట్‌లో ఆయన మాట్లాడుతూ గవర్నర్ ఉభయ సభలను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో రాబోయే ఐదు సంవత్సరాలలో ప్రభుత్వం ఏమి చేస్తుందో చెప్పారన్నారు. ఎన్నికల ప్రణాళికలు పవిత్ర గ్రంథాలైన ఖురాన్, బైబిల్, భగవద్గీతలాంటివన్నారు. బీసీ గర్జనలో చెప్పిన విధంగా 50శాతం నామినేటెడ్ పదవులను బడుగు, బలహీన వర్గాల వారికి ఇస్తామన్నారు. జ్యూడిషియల్ కమిటీ ఏర్పాటు చేసి దేశానికే ఆదర్శంగా నిలిచి నూతన విధానానికి శ్రీకారం చుడుతున్నామన్నారు. నవరత్నాల్లో భాగంగా ఆరోగ్యశ్రీ క్రింద రూ.1000 దాటిన వైద్యం ఖర్చు ప్రభుత్వమే భరిస్తుందన్నారు. కిడ్నీ బాధితులకు రూ.10వేలు ప్రకటించడంతో పాటు అమ్మఒడి కార్యక్రమం కింద బిడ్డను బడికి పంపిన తల్లికి రూ.15వేలు ఇస్తామన్నారు. 9000 కోట్ల భారం పడుతున్నప్పటికీ ఉద్యోగులకు 27శాతం ఐఆర్ పెంచామని, ఆశావర్కర్లు, పారిశుద్ధ్య కార్మికులకు వేతనాలు పెంచామని పేర్కొన్నారు. పేద మహిళలకు ఆసరాగా నాలుగు దఫాలుగా ఏడాదికి రూ.75వేలు అందిస్తామన్నారు.