తెలంగాణ

కరవు సహాయం కోసం అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్ళండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 2: కరవు సహాయం అందించే విషయంలో కేంద్ర ప్రభుత్వంపై వత్తిడి తెచ్చేందుకు రాష్ట్రం నుంచి అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్ళాలని తెలంగాణ శాసనమండలి (కౌన్సిల్)లో ప్రతిపక్ష నేత మహ్మద్ షబ్బీర్ అలీ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కరవును ఎదుర్కొవడానికి వెంటనే లక్ష కోట్ల రూపాయల ఆర్థిక సహాయం అందించాలని కేంద్రాన్ని కోరుదామని ఆయన బుధవారం విలేఖరుల సమావేశంలో అన్నారు. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లోని 443 మండలాల్లో కేవలం 231 మండలాల్లో కరవు ఉన్నట్లు ప్రకటించి చేతులు దులుపుకున్నారని ఆయన విమర్శించారు. వరంగల్ లోక్‌సభ నియోజకవర్గంలో టిఆర్‌ఎస్ విజయం సాధించిన తర్వాత ప్రభుత్వం మరింత దురుసుగా వ్యవహారిస్తున్నదని విమర్శించారు.
బాబుతో టి.టిడిపి నేతల భేటీ
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, డిసెంబర్ 2: తెలంగాణ తెలుగుదేశం పార్టీ ముఖ్య నేతలు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఎపి సిఎం ఎన్.చంద్రమాబునాయుడుతో బుధవారం సమావేశమయ్యారు. టిటిడిపి పోలిట్‌బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖరరెడ్డి కుమారుడి వివాహానికి చంద్రబాబునాయుడు విజయవాడ నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు వచ్చారు. కొత్త దంపతులను ఆశీర్వదించిన తర్వాత చంద్రబాబు ఆ ఫంక్షన్ హాల్లోనే ఒక గదిలో టిటిడిపి ముఖ్యనేతలతో సమావేశమై మంతనాలు జరిపారు. స్థానిక సంస్థల ద్వారా ఎమ్మెల్సీ స్థానాలకు జరగబోయే ఎన్నికలు, ఇతరత్రా తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. ప్రతి దానికి తన కోసం వేచి చూడకుండా మీరే సమిష్టిగా నిర్ణయం తీసుకోవాలని చంద్రబాబు సూచించారు. ఆ తర్వాత ఆయన మళ్లీ విజయవాడ బయలుదే వెళ్లారు.

‘ముస్లిం సామాజిక, ఆర్థిక అంశాలపై
అభిప్రాయాలు తెలపండి’

హైదరాబాద్, డిసెంబర్ 2: రాష్ట్రంలోని ముస్లింల సామాజిక, ఆర్థిక అంశాలపై అభిప్రాయాలు తెలిపేందుకు ఈ నెల 21వ, తేదీ వరకు గడువును పొడిగిస్తూ కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ ఒక ప్రకటనలో తెలిపింది. ముస్లింల సామాజిక, ఆర్థిక, విద్య స్థితిగతులపై అభిప్రాయాలు, సలహాలు, సూచనలు చేయాల్సిందిగా ఇంక్వైరీ కమిషన్ సెప్టెంబర్ 10న ప్రకటన చేసింది. 45రోజుల్లోగా అభిప్రాయాలు, సలహాలు ఇవ్వాల్సిందిగా ఇంక్వైరీ కమిషన్ ఆ ప్రకటనలో కోరింది. అక్టోబర్ 31తో గడువు ముగిసినందున సమయభావం వల్ల ఇంకా అందాల్సిన సలహాలు, సూచనలు రానందున తిరిగి నవంబర్ 30వరకు మరో అవకాశాన్ని కల్పించింది. ముస్లింల సామాజిక, ఆర్థిక అంశాలపై ఇంకా అభిప్రాయాలు, సలహాలు వస్తున్నందున మరో అవకాశాన్ని కల్పిస్తూ ఈ నెల 21వరకు తేదీని పొడిగిస్తూ కమిషన్ ఉత్తర్వులు జారీ చేసింది. ఎవరైనా తమ అభిప్రాయాలను వెబ్‌సైట్ ద్వారా గానీ, పోస్టు కార్డుద్వారా గానీ పంపవచ్చని, లేదా బషీర్‌బాగ్ పోలీసు కంట్రోల్ రూం ఎదురుగావున్న కార్యాలయంలో కార్యాలయ వేళల్లో నేరుగా సలహాలు, సూచనలు చేయవచ్చని ఎంక్వైరీ కమిషన్ పేర్కొంది.
గ్రామీణ ప్రాంతాల్లో కాంగ్రెస్ హవా
పట్టణాలకే పరిమితమైన బిజెపి * గుజరాత్ స్థానిక ఎన్నికల ఫలితాల తీరు
అహ్మదాబాద్, డిసెంబర్ 2: గుజరాత్ స్థానిక ఎన్నికల్లో అధికార బిజెపికి చుక్కెదురైంది. బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి పరాజయం నేపథ్యంలో జరిగిన ఈ ఎన్నికల్లో గుజరాత్ గ్రామీణ ప్రాంతాల్లో కాంగ్రెస్ పట్టు సాధించింది. బిజెపి ప్రాబల్యం పట్టణ ప్రాంతాలకే పరిమితమైంది. దాదాపు రెండు దశాబ్దాలుగా రాష్ట్రంలో అధికారానికి దూరమైన కాంగ్రెస్‌కు స్థానిక ఎన్నికల ఫలితాలు సరికొత్త ఊతాన్నిచ్చాయి. మొత్తం 31 జిల్లా పంచాయతీల్లో 21 చోట్ల కాంగ్రెస్ విజయం సాధించింది. పట్టణ ప్రాంతాల్లో బలమైన ప్రాబల్యాన్ని కనబరిచిన బిజెపి మొత్తం ఆరు మున్సిపల్ కార్పొరేషన్లను కైవసం చేసుకుంది. అలాగే మొత్తం 56మున్సిపాల్టీల్లో 40చోట్ల విజయం సాధించింది. 2010లో జరిగిన జిల్లా పంచాయతీ ఎన్నికల్లో బిజెపి 30చోట్ల విజయం సాధించింది.