బిజినెస్

వాణిజ్య యుద్ధాల స్థితిని తట్టుకుంటాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 21: ప్రపంచంలో వివిధ దేశాల మధ్య జరుగుతున్న వాణిజ్య యుద్ధాల ప్రతికూల ప్రభావం భారత్‌పై కూడా పడిందని, అయితే భారత్ పటిష్టమయిన తన ఆర్థిక వ్యవస్థ కారణంగా దీనిని తట్టుకొని నిలబడుతుందని కేంద్ర వాణిజ్య, పారిశ్రామిక శాఖల మంత్రి పీయూష్ గోయల్ పేర్కొన్నారు. వివిధ దేశాలు వాణిజ్య యుద్ధాలకు తలపడుతున్న నేటి పరిస్థితుల్లో దాని ప్రతికూల ప్రభావం భారత్‌పై కూడా పడుతుంది. ‘దేశాల మధ్య, ఖండాల మధ్య వాణిజ్య యుద్ధాలు జరుగుతున్న నేటి పరిస్థితుల్లో భారత్ అందులో చిక్కుకుంటుంది. కాని, అది ‘క్రాస్‌ఫైర్’. దానినుంచి మనం బయటపడగలం’ అని మంత్రి శుక్రవారం రాజ్యసభలో ప్రశ్నోత్తరాల సమయంలో అన్నారు. ప్రపంచ వాణిజ్య యుద్ధాన్ని అమెరికా ప్రారంభించింది. అమెరికా అల్యూమినియం, ఉక్కు సహా వివిధ ఉత్పత్తులపై దిగుమతి సుంకాల ను పెంచడం ద్వారా వాణిజ్య యుద్ధానికి తెరతీసింది. భారత్ సహా ఇతర దేశాలు కూడా అమెరికా నుంచి దిగుమతి అయ్యే సరుకులపై దిగుమతి సుంకాలను పెంచడం ద్వారా ప్రతీకార చర్యలకు పూనుకున్నాయి. ప్రపంచ వాణిజ్య పరిస్థితులతో సంబంధం లేకుండా భారత్ అవకాశాలను సద్వినియోగం చేసుకొని ఎగుమతులను మరింత పెంచుకోవడానికి గల మార్గాల కోసం అనే్వషిస్తోందని మంత్రి తెలిపారు.

అంతర్జాతీయ వాణిజ్య పరిస్థితులను తట్టుకునే సమర్థత భారత్‌కు ఉందని కూడా ఆయన పేర్కొన్నారు. అమెరికా భారత్‌కు తన జీఎస్‌పీ (జనరలైజ్డ్ సిస్టమ్ ఆఫ్ ప్రిఫరెనె్సస్)ని జూన్ అయిదో తేదీ నుంచి తొలగించిన తరువాత భారత్ ఎగుమతులు బాగా దెబ్బతిన్నాయనే వాదనను గోయల్ తోసిపుచ్చారు.