రాష్ట్రీయం

అవినీతి మకిలి వారికే అంటుతుంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి: రాష్ట్ర అభివృద్ధిలో అవినీతి జరిగిందని గగ్గోలు పెడుతున్న అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకే ఆ మకిలి అంటుతుందని తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. విదేశీ పర్యటనలో ఉన్న ఆయన ఆదివారం పార్టీ నేతలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా తమకు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమన్నారు. అవాస్తవ ఆరోపణలతో లేని అవినీతిని టీడీపీకి అంటించాలని చూస్తే అది వారికే చుట్టుకుంటుందని స్పష్టం చేశారు. ఎప్పుడైనా తమ పార్టీ ప్రజల పక్షానే నిలుస్తుందన్నారు. ప్రజలకు మరింత చేరువయ్యేందుకు పార్టీ నేతలు చొరవ తీసుకోవాలని నిర్దేశించారు. రాష్టవ్య్రాప్తంగా వైసీపీ శ్రేణుల దాడులు, దౌర్జన్యాలకు గురవుతున్న బాధిత కుటుంబాలకు అన్నివేళలా వెన్నుదన్నుగా ఉండి పార్టీపరంగా భరోసా కల్పించాలన్నారు. పోలవరం, ఇతర ప్రాజెక్ట్‌లు, రాజధాని నిర్మాణ పనుల్లో అవినీతి జరిగిందని ముఖ్యమంత్రి జగన్, ఇతర మంత్రులు చేస్తున్న ఆరోపణలపై టెలీకాన్ఫరెన్స్‌లో చర్చించారు. అనంతరం పార్టీ ముఖ్యనేతలు సమావేశమై వైకాపా ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వ ఆరోపణలు రాష్ట్రానికి మేలుచేకూర్చేవి కావన్నారు. టీడీఎల్పీ ఉప నేత అచ్చెన్నాయుడు మాట్లాడుతూ కావాలనే తమపై అవినీతి ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. అక్కడేదో కొండ ఉంది, తవ్వుతామని ప్రగల్భాలు పలుకుతున్నారని.. కొండను తవ్వి ఎలుకను కాదుకదా చీమను, దోమను కూడా పట్టలేరని వ్యంగ్యంగా అన్నారు. ఎక్కడి నుంచి తవ్వుతారో, ఎంత లోతున తవ్వుతారో తవ్వండి, తవ్వడానికి గునపాలే దొరకడం లేదన్నట్లుగా ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారని ఆక్షేపించారు. జగన్ గురించి ఆయన కేబినెట్ మంత్రులే గతంలో ఎలాంటి వ్యాఖ్యలు చేశారో తమవద్ద రికార్డులు ఉన్నాయని తెలిపారు. అందరి చరిత్రలు తమవద్ద ఉన్నాయని, ఈరోజు నీతులు మాట్లాడటం తగదన్నారు. గతంలో జగన్ అవినీతిని విమర్శించిన వారంతా ఇప్పుడు ఆయన పక్కనచేరి తామేదో సచ్ఛీలురన్నట్లు వ్యవహరించటం హాస్యాస్పదమని విమర్శించారు. మంత్రులు బొత్స సత్యనారాయణ, కన్నబాబు తదితరులు జగన్, వైఎస్ అలవాట్ల గురించి గతంలో ఎలాంటి విమర్శలు చేశారో ప్రజలకు తెలుసన్నారు. కౌన్సిల్‌లో టీడీపీ పక్ష నేత యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ ఢిల్లీ వెళ్లి కేంద్రానికి పోలవరం అప్పగిస్తామన్నారని, తిరిగి విజయవాడ వచ్చి తామే పనులు చేపడతామని జగన్ నెలరోజుల్లోనే మాట మార్చడం విడ్డూరమన్నారు. గతంలో అనేక ఆరోపణలు చేసినవారే అధికారులు అవినీతిని బైటపెడితే సన్మానాలు చేస్తామనటం, ఏదో తవ్వితీయాలనటం హాస్యాస్పదంగా ఉందన్నారు. మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు మాట్లాడుతూ తమకున్న బురద టీడీపీకి అంటించడం ద్వారా వైసీపీతో ఒకే గాటకట్టాలని చూస్తున్నారని, టీడీపీపై అభియోగాలు మోపటం ద్వారా అవినీతిని కప్పిపుచ్చుకునే ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ అధికార ప్రతినిధి పంచుమర్తి అనూరాధ మాట్లాడుతూ ప్రజావేదిక కట్టింది ప్రజాధనంతో అనేది గుర్తించాలన్నారు ప్రజల నుంచి వినతులు స్వీకరించేందుకే ప్రజావేదిక అడిగామని, లేఖ రాసినా జవాబివ్వకుండా, ఏ నిర్ణయం తెలియజేయకుండా సామాన్లు బయట పారేయటం ప్రధాన ప్రతిపక్ష నాయకుడి పట్ల మర్యాద కాదని ఖండించారు. సమావేశంలో పార్టీ నేతలు వర్ల రామయ్య, టీడీ జనార్ధన్, దేవినేని అవినాష్, తదితరులు పాల్గొన్నారు.