బిజినెస్

ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో భారీగా పెట్టుబడులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 14: గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది మార్చి చివరి నాటికి ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ అసెట్ బేస్ 13 శాతం పెరిగి రూ. 3.45 లక్షల కోట్లకు చేరుకుంది. రిటైల్ ఇనె్వస్టర్లు ఈ పథకాల్లో భారీగా పెట్టుబడులు పెట్టడమే వీటి అసెట్ బేస్ ఇంత భారీగా పెరగడానికి ప్రధాన కారణం. 2015 మార్చిలో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ అసెట్ బేస్ రూ. 3.05 లక్షల కోట్లు ఉండగా, అది ఈ ఏడాది మార్చి చివరికి రూ. 3.45 లక్షల కోట్లకు చేరుకున్నట్లు భారత దేశంలో మ్యూచువల్ ఫండ్స్ అసోసియేషన్ (ఎఎంఎఫ్‌ఐ)తెలియజేసింది. ఫిబ్రవరి నెలలో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ అసెట్ బేస్ రూ. 3.18 లక్షల కోట్లుగా ఉండింది.