బిజినెస్

నోట్ల రద్దుతో ఎలాంటి నష్టం లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 2: ‘మనదేశం ఇప్పటికీ వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఒకటి. దేశ ఆర్ధికాభివృద్ధి డీమానిటరైజేషన్ వల్ల ఎలాంటి నష్టమూ జరగ లేద’ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం రాజ్యసభలో స్పష్టం చేశారు. ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు అడిగిన అనుబంధ ప్రశ్నపై ఆమె స్పందిస్తూ పై వ్యాఖ్యలు చేశారు. ‘తయరీ రంగంలో నెలకొన్న తిరోగమనం వల్లనే ఆర్థిక ప్రగతి మందగించింది. డీమానిటరైజేషన్ వల్ల కాదు’ అని నిర్మల వెల్లడించారు. ఆర్థికాభివృద్ధి అజెండాతో కేంద్ర ప్రభుత్వం ముందుకు సాగుతోందని, జీడీపీ వృద్ధికోసం పలు సంస్కరణలను వివిధ రూపాల్లో తీసుకురావడం జరిగిందని ఆమె గుర్తు చేశారు. 2018-19లో వృద్ధిరేటు మందగించేందుకు వ్యవసాయ, తత్‌సంబంధ రంగాల్లో వృద్ధి తగ్గడంతోబాటు, హోటళ్లు, రవాణా, స్టోరేజీ, సమాచార, సేవా రంగాలు, బ్రాడ్‌కాస్టింగ్, ప్రజా పాలన, రక్షణ రంగాల్లో వృద్ధిరేటు తగ్గడమే కారణమని ఆమె పేర్కొన్నారు. ప్రధానంగా వ్యవసాయ, అనుంబంధ రంగాలతోబాటు, ఫైనాన్షియల్, స్థిరాస్తి, వృత్తి సేవా విభాగాల్లో అధికంగా వృద్ధిలోటు ఉందన్నారు. వరుసగా మూడో బడ్జెట్ అంచనాల్లో సైతం వ్యవసాయ రంగాభివృద్ధి మందగమనం చోటుచేసుకుందన్నారు. ఈ దఫా ఈ వృద్ధిరేటులో దాదాపు 0.6 శాతం తగ్గుదల ఉంటుందని అంచనా వేశామన్నారు. ఐతే వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటే తయారీ రంగంలో వృద్థిలోటు అధికంగా ఉందని, డీ మానిటరైజేషన్ వల్ల ఎంతమాత్రం కాదని నిర్మల స్పష్టం చేశారు. గత త్రైమాసికంలో దేశ ఆర్థికాభివృద్ధి చర్యల్లో తగ్గుదల నెలకొందని, ఐనప్పటికీ మన దేశం వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల జాబితాలో ఉందని ఆమె చెప్పారు. అమెరికా వృద్ధిరేటు 2016 నుంచి ఇప్పటి వరకు వరుసగా 1.6, 2.2, 2.9, 2.3 శాతంగా ఉందని, అలాగే చైనా వృద్ధిరేటు సైతం 6.7, 6.8, 6.6. 6.3 శాతం వంతున వరుసగా తగ్గుతూనే ఉందని, ఐతే మనదేశం మాత్రం 7 శాతానికన్నా అధికంగా 7.3 శాతం వృద్ధిరేటుతో ఉందని నిర్మలా సీతారామన్ రాజ్యసభకు వివరించారు. ప్రజలకు ఎక్కువ ద్రవ్యం అందుబాటులో ఉండేలా ప్రభుత్వం వివిధ చర్యలు చేపట్టిందని, ఇందులో భాగంగానే కిసాన్ సమ్మాన్ యోజన పథకం అమల్లోకి వచ్చిందని దీనివల్ల డీబీటీల ద్వారా నేరుగా ధనం ప్రజల చేతుల్లోకి వెళుతోందని తెలిపారు. అలాగే పారిశ్రామిక అభివృద్ధిలో భాగంగా సంస్థలకు రుణ సదుపాయాలను సైతం పెంచడం జరిగిందని, అలాగే కింది స్థాయిలో ఔత్సాహికులకు సైతం ప్రభుత్వం వెన్నుదన్నుగా ఉంటోందని తెలిపారు. నిరర్ధక ఆస్తులు, మొండి బకాయిల సమస్యల పరిష్కారానికి బ్యాంకుల సహకారంతో కృషి చేస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా ఆమె లిఖిత పూర్వకంగా ఇచ్చిన సమాధానంలో గుర్తు చేశారు.