బిజినెస్

మందగమనంలో వర్జీనియా కొనుగోళ్లు..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, జూలై 8: వర్జీనియా పొగాకు కొనుగోళ్లు మందగమనంలో సాగుతున్నాయి. పొగాకు కొనుగోళ్లకు బోర్డు నిర్ణయించిన వంద రోజుల కార్యచరణలో ఇప్పటికే 50 రోజులు దాటినా ఇంకా పలువురు రైతులు వేచిచూసే ధోరణినే అవలంబిస్తున్నారు. ఫలితంగా కొనుగోళ్లు ఇంకా సాగుతున్నాయి.
తేలికపాటి నల్లరేగడి భూముల్లో పండించిన వర్జీనియా పొగాకు వేలం తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం రూరల్ మండలం తొర్రేడులోని కేంద్ర పొగాకు బోర్డు వేలం కేంద్రంలో జరుగుతోంది. అయితే ధరల స్థితిగతులను బట్టి మాత్రమే రైతులు వేలం కేంద్రానికి బేళ్లను తీసుకురావడంలో వేలం ప్రక్రియ చాలాకాలం కొనసాగుతూనే ఉంటోంది. ఈలోగా మళ్ళీ పొగాకు నారుమడుల సీజన్ మొదలైపోతోంది. రైతులకు కొనుగోళ్ళ తాలూకు లావాదేవీలు తేల్చడానికి గానీ, భూమిని సిద్ధం చేసుకోవడం, విత్తులు, నారు మడులు వేసే సమయంలో అవగాహన కల్పించడం వంటి ప్రక్రియకు గడువు సరిపోవడం లేదని గుర్తించారు. దీంతో వేలం ప్రక్రియకు ఈ ఏడాది నుంచి విధిగా 100 రోజుల్లో పూర్తి చేయాల్సిందిగా కేంద్ర పొగాకు బోర్డు వేలం కార్యాచరణ ప్రణాళికను అమల్లోకి తీసుకొచ్చింది.
ఈ ఏడాది నుండే ప్రణాళిక అమల్లోకి వచ్చింది. ఈ ఏడాది మొత్తం 25 లక్షల కిలోల పొగాకు కొనుగోలుకు ప్రణాళిక రూపొందించారు. ఏప్రిల్ 11 నుంచి మొదలైన వేలంలో ఇప్పటివరకు సుమారు 15.54 లక్షల కిలోల కొనుగోలు మాత్రమే పూర్తయ్యింది. రోజుకు సరాసరి 36,827 కిలోల వంతున, రోజుకు 309 బేళ్లు కొనుగోలు చేసేలా నిర్ధేశించారు. రోజుకు 340 బేళ్ళు రైతులు వేలం కేంద్రానికి తీసుకొచ్చేలా వంద రోజుల లెక్క కట్టి వేలం ప్రణాళిక రూపొందించారు. ఈ విధంగా ఆగస్టు 19వ తేదీకల్లా వేలం ముగిసే విధంగా నిర్ణయించారు. రోజుకు వచ్చే 340 బేళ్ళల్లో 309 బేళ్ళను బయ్యర్లు కొనుగోలు చేయాల్సివుంది.
ప్రస్తుతం పది కంపెనీల బయ్యర్లు కొనుగోళ్లు జరుపుతున్నారు. ఇప్పటి వరకు 11,516 బేళ్లు అమ్మకానికి పెట్టగా 8,592 బేళ్ల కొనుగోలు జరిగింది. ఇప్పటి వరకు సుమారు రూ.13.29 కోట్ల విలువైన పొగాకు కొనుగోళ్లు జరిగాయి. సరాసరి ధర కేజీ రూ.130 లభించింది. అత్యధిక ధర రూ.178 పలికింది. అత్యల్ప ధర రూ.80 లభించింది. బ్రైట్ రకం పొగాకు సరాసరి ధర కిలో రూ.158.28, మీడియం సరాసరి ధర రూ.111.94, లోగ్రేడ్ సరాసరి ధర రూ.89.32 పలికింది. ఇప్పటివరకు వేలం కేంద్రానికి వచ్చిన వాటిలో సుమారు 2,923 బేళ్లను తిరస్కరించారు.
రైతులు సకాలంలో వేలం కేంద్రానికి తమ పొగాకును తీసుకొచ్చి మంచి ధరలు పొందాలని వేలం కేంద్రం అధికారులు సూచిస్తున్నారు. బయ్యర్లు ఇక పెరిగే అవకాశంలేదని తెలుస్తోంది.వాతావరణంలో వచ్చిన మార్పులను దృష్టిలో పెట్టుకుని కూడా రైతుల వద్ద వున్న పొగాకు రంగు మారకుండా త్వరితగతిన వేలం కేంద్రానికి చేర్చి అమ్మకాలు సాగించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.