ఆంధ్రప్రదేశ్‌

కొత్త మద్యం విధానంపై విస్తృత కసరత్తు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూలై 13: నూతన మద్యం పాలసీ పై రాష్ట్ర ప్రభుత్వం విస్తృత కసరత్తు చేస్తోంది. ఇందుకుగాను పక్కా ప్రణాళికతో ముందుకు వెళుతోంది. అక్టోబర్ రెండో తేదీన గాంధీ జయంతి సందర్భంగా ప్రభుత్వ మద్యం దుకాణాలను ప్రారంభించే యోచనలో ఉన్నట్లు అధికారవర్గాల సమాచారం. ఆ రోజు సెలవుదినం అయినందున ముందు రోజు నుంచే మద్యం దుకాణాలను ప్రభుత్వం నిర్వహించాలని యోచిస్తున్నది. ఇందుకోసం ఎక్సైజ్ ప్రొషిబిషన్ శాఖ సహాయ కమిషనర్ అనిల్ కుమార్‌రెడ్డి, కృష్ణా సూపరింటెండెంట్ మన్‌హర్‌తోపాటు మొత్తం ఆరుగురు అధికారులతో కూడిన ఓ ప్రత్యేక బృందం గత రెండు రోజులుగా కేరళలో మద్యం అమ్మకాల తీరుతెన్నులను అధ్యయనం చేస్తోంది. కేరళ మొత్తంపై 450కి మించి వైన్‌షాపులు లేవు. హోటళ్లలో మాత్రం బార్ అండ్ రెస్టారెంట్లు నడుస్తున్నాయి. రాష్ట్రంలో నూతన మద్యం పాలసీ కోసం జూన్ నెలాఖరుతో ముగిసిన గడువును మరో మూడు నెలలకు పొడిగించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 4,380 వైన్ షాపులు ఉండగా దశలవారీగా వైన్‌షాపులన్నింటినీ మూసివేయడానికి ప్రతి ఏటా 25 శాతం మద్యం దుకాణాలను తగ్గించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 4380 వైన్‌షాపుల్లో నాలుగో వంతు పోను మిగిలిన 3,285 వైన్‌షాపులను ప్రభుత్వం స్వయంగా నడపనున్నది. దీని వల్ల నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించినట్లవుతుందని కూడా ప్రభుత్వం భావిస్తోంది. కనీసం ఒక్క దుకాణానికి నలుగురు చొప్పున కనీసం 15వేల మందికి ఉపాధి లభిస్తుంది. ఒక్క ప్రభుత్వ మద్యం దుకాణంలో ముగ్గురు సేల్స్ మెన్లు, ఒక సూపర్‌వైజర్ ఉండనున్నారు. షాపు ఆర్థిక లావాదేవీలన్నంటికీ సూపర్‌వైజర్‌ను బాద్యుడిగా చేస్తారు. వీరి జీతభత్యాలు ఇతరాత్రా అలవెన్స్‌ల విషయమై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ప్రధానంగా బెల్ట్‌షాపులను నిరోధించాలన్నది సీఎం జగన్ లక్ష్యం. ప్రభుత్వమే మద్యం దుకాణాలు నిర్వహిస్తున్నందున బెల్ట్‌షాపుల ప్రస్తావన ఉండదు. ప్రభుత్వమే దుకాణాలు నిర్వహించే సమయంలో ఎవరైనా భారీగా కొనుగోలు చేసి అనధికారికంగా విక్రయిస్తుంటే ఫిర్యాదులపై తక్షణం దాడులు జరిగే అవకాశాలున్నాయి. ఇక బార్ అండ్ రెస్టారెంట్లను ప్రస్తుతానికి ప్రైవేట్ వారు నిర్వహిస్తున్నా ఒక బాటిల్‌ను కూడా వెలుపలకు విక్రయించే వీలు లేదు. ఒక వేళ విక్రయించినా బాటిల్ సీలు తీసి ఇవ్వాల్సి ఉంటుంది. సీలు తీసిన బాటిల్స్‌ను ఇతరులు కొనుగోలు చేసే పరిస్థితి ఎటూ ఉండదు.