ఆంధ్రప్రదేశ్‌

ఉన్నత విద్యా మండలిలో అవకతవకలపై విచారణకు ఏకసభ్య కమిషన్ ఏర్పాటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూలై 19: రాష్ట్ర ఉన్నత విద్యా మండలిలో అవకతవకలు చోటు చేసుకున్నట్లు ప్రభుత్వం దృష్టికి రావడంతో వీటిపై విచారణకు ఏక సభ్య కమిషన్‌ను శుక్రవారం నియమించింది. ఉన్నత విద్యా మండలిలో జరిగిన అవకతవకలను తీవ్రంగా పరిగణిస్తున్నట్లు ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది. బాపట్లలోని ఏపీ మానవ వనరుల అభివృద్ధి ఇన్‌స్టిట్యూట్ డైరెక్టర్ జనరల్, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి డి.చక్రపాణిని విచారణాధికారిగా నియమించింది. ఈ కమిషన్ ఆగస్టు 31లోగా నివేదిక అందచేయాల్సి ఉంటుంది. కాగా, రాష్ట్ర శాసన మండలిలో ఉన్నత విద్యా మండలిలో జరిగిన అవకతవకలపై మంత్రి సురేష్ ఆరోపణలు చేయడం తెలిసిందే. దీనిపై విచారణ చేసి, నిజాలను నిగ్గుతేలుస్తామని ప్రకటించడం తెలిసిందే.