క్రైమ్/లీగల్

ఈడీ ఎదుట ‘గాలి’ హాజరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 22: గనుల అక్రమాల విషయంలో మనీ లాండరింగ్‌కు పాల్పడిన కేసులో కర్నాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి హైదరాబాద్ బషీర్‌బాగ్‌లోని ఈడీ కార్యాలయానికి సోమవారం హాజరయాయరు. మనీ లాండరింగ్‌కు పాల్పడినట్టు 2007లో సీబీఐ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. గనుల అక్రమాల విషయంలో గాలి భారీగా మనీ లాండరింగ్‌కు పాల్పడినట్టు అభియోగాలు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఉదయం 11.00 గంటలకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఎదుట ఆయన విచారణకు హాజరయ్యారు. ఈడీ కార్యాలయంలో జరిగిన ఈ విచారణ సాయంత్రం వరకు కొనసాగింది. పలు కీలక అంశాలపై అధికారులు సమాధానలు రాబట్టేందుకు ప్రయత్నించారు. ప్రధానంగా విదేశాలకు నగదు తరలించడంపై అధికారులు జనార్దన్ రెడ్డిని ఈడీ అధికారులు ప్రశ్నించినట్టు తెలిసింది.

చిత్రం...ఈడీ విచారణకు వస్తున్న గాలి జనార్దన్ రెడ్డి