బిజినెస్

విద్యుత్ వాహనాల కోసం కార్యాచరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అహమ్మదాబాద్ : విద్యుత్ వాహనాలు (ఎలక్ట్రిక్ వెహికల్స్), వాటి అనుబంధ ఉపకరణాలైన బ్యాటరీలు వంటి వాటి వినియోగం ద్వారా స్వచ్ఛ నగరాలుగా తీర్చిదిద్దడంతోపాటు ఆయిల్ దిగుమతులు తగ్గించడం, సోలార్ పవర్‌ను వినియోగించుకునేందుకు భారత్ కార్యాచరణను చేపట్టిందని నీతి ఆయోగ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అమితాబ్ కాంత్ అన్నారు. శనివారంనాడు ఇక్కడ జరిగిన ఒక సమావేశాన్ని ఉద్దేశించి వీడియో లింక్ ద్వారా మాట్లాడారు. విద్యుత్ వాహనాలకు ఉపయోగించే దేశవాళీ బ్యాటరీ తయారీ ‘భారీ మార్కెట్‌కు అవకాశం’ కలగడంతోపాటు రవాణాపరంగా వాతావరణానికి మేలు చేయడంతోపాటు వాతావరణ కాలుష్యాన్ని అరికట్టేందుకు దోహదపడడం, శక్తి సామర్థ్యాన్ని బలపడం, కొత్తగా ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఆస్కారం ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా మన దేశం రెండు చక్రాలు, మూడు చక్రాల విద్యుత్ వాహనాలు, ప్రజా రవాణా వాహనాలపై దృష్టి సారించిందని ఆయన అన్నారు. ‘రెండు చక్రాలు, మూడు చక్రాల విద్యుత్ వాహనాలు, ప్రజా రవాణాకు వినియోగించే విద్యుత్ వాహనాల తయారీ రంగానికి, వాటికి అవసరమయ్యే బ్యాటరీల తయారీకి భారత్ కార్యాచరణ రూపొందిస్తోంది. ఇందులో భాగంగానే 80 శాతం వరకు వాటికి సంబంధించిన పరికరాలు, బ్యాటరీలు తయారు చేసేందుకు నిర్ణయించింది’ అని ఆయన పేర్కొన్నారు. విద్యుత్ వాహనాల వినియోగం, వాటి విడిభాగాలు, బ్యాటరీ వంటివాటి తయారీ ఎక్కువైతే ఆయిల్ దిగుమతులు గణనీయంగా తగ్గించుకోవడంతోపాటు ఆర్థిక పరిస్థితులను మెరుగుపరచుకోవచ్చునని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం సమాజంలో ప్రతి 1000 మందిలో 20 మందికి మాత్రమే వాహనాలు ఉన్నాయని ఆయన అన్నారు. ‘మన లక్ష్యం దేశంలోని నగరాలను పరిశుభ్రంగా ఉంచడమేనని, దిగుమతులను తగ్గించుకోవడం, సూర్యరశ్మిని వినియోగించుకోవడం ద్వారా కూడా విద్యుత్ వాహనాలకు శక్తిని అందించవచ్చునని ఆయన పేర్కొన్నారు. ‘మేక్ ఇన్ ఇండియా’ కోసం పరితపిస్తున్న భారత్‌లో పర్యావరణ వ్యవస్థను మెరుగుపరచేందుకు విద్యుత్ వాహనాల తయారీ ఒక ఉద్యమంగా సాగాలని ఆయన అభిప్రాయపడ్డారు.

చిత్రం...నీతి ఆయోగ్ సీఈఓ అమితాబ్ కాంత్