బిజినెస్

‘ఎస్‌సీఈడీ’ పథకం ద్వారా ఎన్‌టీపీసీ పరిధిలోని డిస్కంలకు గణనీయ లబ్ధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 28: జాతీయ థర్మల్ పవర్ కార్పొరేషన్ (ఎన్‌టీపీసీ) ‘సెక్యూరిటీ కన్‌స్ట్రెయిన్డ్ ఎకనమిక్ డిస్పాచ్’ (ఎస్‌సీఈడీ) విధానం ద్వారా ప్రాధాన్యతా ప్రాతిపదికన తక్కువ ధరలకే చేస్తున్న విద్యుత్ సరఫరాతో పలు డిస్కంలు లబ్ధిపొందుతున్నాయి. ఎస్‌సీఈడీ విధానం దాదాపు ఏడాది క్రితం అమలులోకి వచ్చింది. దీనిద్వారా విద్యుత్ ఉత్పత్తి సంస్థలు బొగ్గు గనులకు సమీపంలో ఉండే ప్లాంట్లను విస్తరించుకుని ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకోవడానికి వీలుకలుగుతుంది. దీనివల్ల ఇంధనానికి సంబంధించిన సరుకు రవాణా ఖర్చులు తగ్గుతాయి. తద్వారా విద్యుత్ ఉత్పత్తి ఖర్చులు తగ్గి అటు డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు (డిస్కంలు), ఇటు వినియోనియోగదారులు లాభపడతారు. ఐతే తొలుత ఏర్పాటు చేసిన లక్ష్యాన్ని సవరించి తర్వాత ఈ ఎస్‌సీఈడీ విధానాన్ని జాతీయ స్థాయి ‘మెరిట్ ఆర్డర్’ మేరకు కొన్ని ఎంపిక చేసిన విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలకే పరిమితం చేయడం జరిగింది. దీని ప్రకారం కేంద్రం నుంచి ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా విద్యుత్ సరపరా సహాయాన్ని కోరినపుడు తొలుత తక్కువ ఇంధన ఖర్చులతో కూడిన యూనిట్ల నుంచి ఆ రాష్ట్రాలకు విద్యుత్ సరఫరా జరుగుతుంది. ఈక్రమంలో అధికశాతం రాష్ట్రాలు ఈ ఎస్‌సీఈడీ విధానాన్ని వినియోగించుకుంటున్నాయి. ఇందువల్ల ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలకు తక్కువ ధరలకే విద్యుత్ కొనుగోలు అవకాశాలు పెరిగాయి. తాజా అంచనాల మేరకు డిస్కంలకు ఎస్‌సీఈడీ విధానం వల్ల రోజుకు రూ. 2.5 కోట్ల మేర ఆదా అవుతుంది. ప్రస్తుతం 56 గిగావాట్ల ఉత్పత్తి సామర్థ్యం గల 49 థర్మల్ పవర్ ప్లాంట్లు ఎస్‌సీఈడీ పైలట్ ప్రాజెక్టు పరిధిలో ఉన్నాయి. మొత్తం దేశంలోని అన్ని బొగ్గుగనుల సమీప విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లు, స్వతంత్ర విద్యుత్ ఉత్పత్తిదారులు, రాష్ట్రాల విద్యుత్ ఉత్పత్తి కంపెనీలు ఈ ఎస్‌సీఈడీ ద్వారా ఏడాదికి రూ. 3000 కోట్ల మేర ఆదా చేయగలుగుతున్నాయని తేలింది. కాగా పవర్ సిస్టం ఆపరేషన్ కార్పొరేషన్ (పీఓఎస్‌ఓసీఓ) ద్వారా కలుగుతున్న ఈ సదుపాయ వల్ల విద్యుత్ రీడ్యూల్ చేసుకునేందుకు అవకాశం ఏర్పడుతోంది. ఈ పథకం పరిధిలోని కంపెనీలకు తొలుత ఏర్పాటు చేసుకున్న ఒప్పందాల కంటే తక్కువగానే ఆఖరి టారిఫ్‌లు వస్తున్నాయి. ఎన్‌టీపీసీ గ్రూప్ కంపెనీల టోకు విద్యుత్ ఉత్పత్తి 2018-19 సంవత్సరంలో మొత్తం 3.5.90 బిలియన్ యూనిట్లు. అంతకు క్రితం ఏడాది జరిగిన 294.27 బిలియన్ యూనిట్ల ఉత్పత్తికంటే ఇది అధికం. ఈ సంస్థల కనీస విద్యుత్ టారిఫ్ యూనిట్‌కు రూ. 3.38గా ఉంది.