బిజినెస్

వొడాఫోన్-ఐడియా వాటాలు 27 శాతం పతనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 29: ‘వొడాఫోన్ ఐడియా’ లిమిటెడ్ వాటాలు సోమవారం 27 శాతం పతనమయ్యాయి. కంపెనీ తొలి త్రైమాసిక ఫలితాలు బలహీనంగా ఉండటంతో మదుపర్లు ఆసక్తి చూపకపోవడంతోబాటు ఈ సంస్థ మార్కెట్ విలువ రూ. 7,126 కోట్లకు తగ్గిపోవడం సోమవారం తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపింది. బీఎస్‌ఈలో ఈ సంయుక్త కంపెనీ వాటా ధర 26.81 శాతం పడిపోయి 52 వారాల కనిష్ట స్థాయి రూ. 6.75కు చేరింది. అలాగే ఎన్‌ఎస్‌ఈలో సైతం 27 శాతం పడిపోయిన వాటాల విలువ ఒక్కోవాటా ధర రూ. 6.75కు చేరింది. బీఎస్‌ఈలో ఈ కంపెనీ విలువ ఏకంగా రూ. 19,453.86 కోట్ల నుంచి రూ. 7.126 కోట్లకు తగ్గిపోయింది. ట్రేడ్ వాల్యూ ప్రకారం బీఎస్‌ఈలో ఈ కంపెనీకి చెందిన 484.86 లక్షల వాటాలు, ఎన్‌ఎస్‌ఈలో 66 కోట్ల వాటాలు ట్రేడయ్యాయి. గ్రూప్ ఫేర్లలోనూ అమ్మకాల వత్తిడి నెలకొంది. బీఎస్‌ఈలోగ్రాసిమ్ ఇండియా లిమిటెడ్ 9.08 శాతం, ఆదిత్య బిర్లా మనీ 1.65 శాతం, అల్ట్రాటెక్ సిమెంట్ 2.94శాతం, హిండాల్కో ఇండస్ట్రీస్ లిమిటెడ్ 2.54 శాతం వంతున నష్టపోయాయి. ఈగ్రూప్ కంపెనీలు మొత్తం రూ. 17,500 కోట్ల సామూహిక నష్టాన్ని చవిచూశాయి.