బిజినెస్

స్వల్ప ధరలకే సంప్రదాయేతర ఇంధన సరఫరాలో.. భారత్ అగ్రగామి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 29: సంప్రదాయేతర ఇంధనం (పునరుర్పాదక విద్యుత్)ను అతి స్వల్ప ధరలకే అందించడంలో ఆసియా పసిఫిక్ దేశాల్లో భారత్ మార్కెట్ అగ్రగామిగా నిలిచిందని సోమవారం నాడిక్కడ విడుదలైన అంతర్జాతీయ పరిశోధన, కన్సల్టెన్సీ సంస్థ ‘ఉడ్ మెకెన్జీ’ అధ్యయన నివేదిక వెల్లడించింది. భారత్‌లో సౌర విపీడన విద్యుత్ తయారీకి ‘లెవలైజ్డ్ కాస్ట్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ’(ఎల్‌సీఓఈ) ఓ మెగావాట్ అవర్ (ఎండబ్ల్యుహెచ్)కు 38 డాలర్లు ఖర్చవుతోంది. బొగ్గు ద్వారా తయారవుతున్న విద్యుత్ ధరకంటే ఇది 14 శాతం తక్కువ. ప్రస్తుత పన్నుల విధానం, భవన నిర్మాణం, దానిపై సౌర విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు, నిర్వహణ అంశాలను పరిగణనలోకి తీసుకుని తమ సంస్థ అధ్యయనం చేయడం జరిగిందని ఉడ్‌మెకన్జీ రీసెర్చ్ డైరెక్టర్ అలెక్స్ మిత్‌వర్త్ తెలిపారు. ఆసియా పసిఫిక్ దేశాల్లో భారత్ విద్యుత్ వినియోగంలో రెండో అతిపెద్ద దేశంగా ఉందన్నారు. ఇక్కడ 421 గిగావాట్ల సౌర విద్యుత్ తయారీకి సంబంధించిన ప్లాంట్లను ఏర్పాటు చేసుకోవడం జరిగిందని ఈ ఏడాది మరో 38 గిగావాట్ల వినియోగం అదనంగా జరుగుతుందని అంచనా వేస్తున్నట్టు ఆయన వివరించారు. సౌర విద్యుత్‌కు సంబంధించిన అత్యుత్తమ నాణ్యతతో కూడిన పరికరాలు అందుబాటులో ఉండటంతోబాటు, మార్కెట్ పరిమాణం, వాణిజ్యంలో పోటీ ఈ విద్యుత్ ధరలు ఆసియా పసిఫిక్ దేశాల్లో ఇతర దేశాల కంటే సగానికన్నా తక్కువకే అందుబాటులోకి వస్తున్నాయని ఆ నివేదిక వెల్లడించింది. ఆస్ట్రేలియా ఇప్పటికే గ్యాస్, బొగ్గు, నీటి ఆధారిత విద్యుత్ ధరలకంటే 52 శాతం తక్కువకే సౌర విద్యుత్‌ను అందిస్తున్న దేశంగా ప్రథమ స్థానంలో ఉందని తెలిపింది. గాలి మరలు, సౌర విద్యుత్ తయారీకి ఆసియా పసిఫిక్ దేశాల్లో ఖర్చులు 2030 నాటికి బొగ్గు ఆధారిత విద్యుత్ తయారీకంటే 29 శాతం తగ్గుతాయని పేర్కొంది. బొగ్గు ఆధారంగా తయారయ్యే విద్యుత్ కంటే ఈ ప్రాంతంలో సంప్రదాయేత విద్యుత్ తయారీకి 17 శాతం రాయితీలు లభ్యమవుతున్నాయని, ప్రస్తుతం మలేషియా, ఇండోనేషియా మాత్రం బొగ్గు ఆధారిత విద్యుత్ కంటే సంప్రదాయేత విద్యుత్‌నే అధికంగా వినియోగిస్తున్నాయని నివేదిక తెలిపింది. మనదేశంలో తగ్గిన ధరల కారణంగా వచ్చే కొన్ని సంవత్సరాల్లో ఈ విద్యుత్ తయారీ పెరిగి మరో శాతం వరకు ధరల్లో తగ్గుదల నమోదయ్యే అవకాశం ఉందని అంచనావేసింది.