ఆంధ్రప్రదేశ్
శ్రీశైలం ఈఓ బదిలీ
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Tuesday, 20 August 2019
శ్రీశైలం టౌన్: శ్రీశైలం దేవస్థానం ఈఓ శ్రీరామచంద్రమూర్తిని బదిలీ చేస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. దేవస్థానానికి చెందిన లలితాంబిక వాణిజ్య సముదాయంలోని దుకాణాల వేలం పాటల్లో పాటదారుల మధ్య తలెత్తిన వివాదాలు, గొడవలు, అన్యమతస్తులకు వీటిని కేటాయిస్తున్నారన్న ఆరోపణల నేపధ్యంలో ఈఓ శ్రీరామచంద్రమూర్తిపై బదిలీ వేటు పడింది. ఆయన స్థానంలో కెఎస్.రామారావును ఈఓగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.