కృష్ణ

అర్హులందరికీ సంక్షేమ ఫలాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం (కోనేరుసెంటర్) : అర్హులందరికీ సంక్షేమ పథకాలు అమలు చేస్తామని రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) అన్నారు. బుధవారం నియోజకవర్గంలోని పలువురు తమ సమస్యలను మంత్రి పేర్ని నానిని కలిసి వినతిపత్రాలు అందజేశారు. నిజాంపేటకు చెందిన ఆలకుంట్ల మంగమ్మ అనే వృద్ధురాలు కడుపులో బల్ల, కిడ్నీలో రాళ్ల వ్యాధితో బాధ పడుతున్నానని, ఆపరేషన్ చేయించాలని, కలిశెట్టి లక్ష్మి తన భర్త కిడ్నీ వ్యాధితో మృతి చెందారని సీఎం సహాయ నిధి నుండి ఆర్థిక సాయం ఇప్పించాలని మంత్రి పేర్నికి వినతిపత్రం అందజేశారు. కరగ్రహారంకు చెందిన యార్లగడ్డ కోటేశ్వరమ్మ గర్భసంచి వ్యాధితో బాధ పడుతున్నట్లు, ప్రైవేట్ ఆస్పత్రిలో వైద్య చికిత్స చేయించుకున్నానని, డాక్టర్ రాసిన మందులు కొనుగోలు చేసే ఆర్థిక పరిస్థితులు లేవని, మందుల కొనుగోలుకు సాయం అందించాలని మంత్రిని కోరింది. చినకరగ్రహారం గ్రామానికి చెందిన వడుగు వెంకటేశ్వరమ్మ ఆర్థిక ఉపాధి కోసం సహాయం కోరగా త్వరలో వివిధ కార్పొరేషన్ల ద్వారా లబ్ధిదారులకు వివిధ పథకాలు, రుణాలు మంజూరు చేయడం జరుగుతుందని మంత్రి తెలిపారు. 2వ వార్డు బైపాస్ రోడ్డు కమ్మ కల్యాణ మండపం నుండి పెడన రోడ్డు వరకు రాత్రి సమయాల్లో వీధి దీపాలు లేకపోవటం వల్ల అంధకారం నెలకొంటోందని, చాలా మంది ప్రమాదాలకు గురవుతున్నారని విజయకుమార్ మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. ఇలా పలువురు తమ సమస్యలను మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు.