బిజినెస్

దిగుమతులు పెంచుకుంటాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బియారిడ్జ్/లండన్, ఆగస్టు 26: అమెరికా నుంచి చమురు సహా దిగుమతుల పరిమాణాన్ని గణనీయంగా పెంచుకుంటామని భారత్ స్పష్టం చేసింది. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌తో సోమవారం నాడిక్కడ జరిగిన సమావేశం సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈ విషయాన్ని వెల్లడించారు. ఇప్పటికే నాలుగు బిలియన్ డాలర్ల దిగుమతులు జరుగుతున్నాయని పేర్కొన్న ఆయన వాణిజ్య పరంగా తలెతుతున్న విబేధాలను కూడా పరిష్కరించేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. అనేక వాణిజ్య ఆర్థిక అంశాలపై రెండు దేశాల మధ్య తీవ్ర విబేధాలు తలెత్తిన నేపథ్యంలో ఈ పర్యటనకు విశేష ప్రాధాన్యత చేకూరింది. ముఖ్యంగా సుంకాలు, మార్కెట్ల అనుసంథానతలపై ఇరు దేశాల మధ్య తీవ్ర వాగ్వివాదాలు జరుగుతున్నాయి. వచ్చే నెలలో నరేంద్ర మోదీ అమెరికా పర్యటనలోగానే ఇరు దేశాల వాణిజ్య మంత్రుల మధ్య సమావేశం జరగాలని సంకల్పించారు. ఈ సమావేశంలో అనేక వాణజ్య అంశాలు చర్చకు వస్తాయని భారత విదేశాంగ శాఖ మంత్రి విజయ్ గోఖ్లే తెలిపారు. మోదీ-ట్రంప్‌ల మధ్య 40 నిమిషాల పాటు జరిగిన సమావేశం వివరాలను ఆయన వెల్లడించారు. భారత వాణిజ్య మంత్రి పియూష్ గోయల్ ఇంతకు ముందే వాషింగ్టన్ వెళ్ళాల్సి ఉన్నప్పటికీ అనివార్య కారణాల వల్ల అది జరిగలేదని ఆయన తెలిపారు. మోదీ ట్రంప్ సమావేశానికి సంబంధించిన ప్రకటనను వాషింగ్టన్‌లో విడుదల చేశారు. ద్వైపాక్షిక వాణిజ్యాన్ని, ఆలాగే భాగస్వామ్యాన్ని పెంపొందించుకోవాలని రెండు దేశాలు సంకల్పించాయని ఈ ప్రకటనలో తెలిపారు. భారత్ విధిస్తున్న సుంకాల గురించి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీవ్ర అసహనం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ట్రంప్-మోదీ సమావేశానికి ముందు భారత్ సుంకాలపై జపాన్ కూడా మాట్లాడింది. అమెరికా వస్తువులపై విధిస్తున్న ఈ తీవ్ర సుంకాలను వెనక్కి తీసుకోవాలని కోరింది. కాగా అమెరికా నుంచి ఇంధన దిగుమతుల ప్రాధాన్యతను మోదీ వివరించారని గోఖ్లే తెలిపారు. వచ్చే నెలలో ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో పాల్గొనేందుకు నరేంద్ర మోదీ వెళతారని ఆ సందర్భంగా అమెరికా ఇంధన రాజధాని హూస్టన్‌లో కూడా పర్యటిస్తారని ఆయన తెలిపారు. అక్కడ జరిగే సమావేశంలో సెప్టెంబర్ 22న భారతీయ సంతతికి చెందిన వారిని ఉద్ధేశించి మాట్లాడుతారని, అలాగే ఇంధన కంపెనీల సిఇవోలతో కూడా సమావేశమవుతారని గోఖ్లే తెలిపారు.
చిత్రం... డోనాల్డ్ ట్రంప్‌తో భారత ప్రధాని మోదీ