బిజినెస్

బ్యాంకాక్‌కు నాక్ ఎయిర్‌లైన్స్ సర్వీసు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఆగస్టు 26: విశాఖ నుంచి బ్యాంకాక్‌కు విమాన సర్వీసు నడిపేందుకు నాక్ ఎయిల్‌లైన్స్ ముందుకు వచ్చింది. ప్రస్తుతం విశాఖ నుంచి వారానికి మూడుసార్లు బ్యాంకాక్‌కు ఎయిర్ ఏషియా విమాన సర్వీసు నడిపేది. సెప్టెంబర్ 23వతేదీ నుంచి ఈ విమానయాన సంస్థ సర్వీసును రద్దు చేసుకుంది. ఈ నేపథ్యంలో ఏపీ ఎయిర్ ట్రావెలర్స్ అసోసియేషన్, ఏపీ టూర్ అండ్ ట్రావెలర్స్ అసోసియేషన్ విజ్ఞప్తి మేరకు విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ నాక్ ఎయిర్‌లైన్స్ ప్రతినిధులతో సోమవారం సమావేశమై బ్యాంకాక్‌కు సర్వీసు నడిపేందుకు ఒప్పించారు. విశాఖలోని ఎంపీ కార్యాలయంలో నాక్ ఎయిర్‌లైన్స్ సేల్స్ విభాగాధిపతి పూనమ్ సహా ఏపీ టూర్స్ అండ్ ట్రావెల్స్ అసోసియేషన్ అధ్యక్షుడు విజయ్ మోహన్, ఏపీ ఎయిర్ ట్రావెలర్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు ఒ నరేష్‌తో ఎంపీ చర్చించారు. వచ్చే అక్టోబర్ నుంచి నాక్ ఎయిర్‌లైన్స్ బ్యాంకాక్‌కు విమానాన్ని నడిపేందుకు సూత్రప్రాయంగా అంగీకరించారు. ఎయిర్ ఏషియా సంస్థ తక్కువ ధరకు సర్వీసు నడపడం ద్వారా నష్టాల పాలైందని ట్రావెల్ ఏజెన్సీలు భావిస్తుండగా, విశాఖ నుంచి బ్యాంకాక్‌కు రూ.12వేల ఛార్జీ ఆమోదయోగ్యంగా ఉంటుందని టూర్స్, ట్రావెలర్స్ అసోసియేషన్ అభిప్రాయపడింది.

చిత్రం... నాక్ ఎయిర్‌లైన్స్ సేల్స్ హెడ్‌తో చర్చిస్తున్న ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ