బిజినెస్

పసిడి ధర పైపైకి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 26: వరుసగా ఐదోరోజూ పసిడి ధరలు పెరిగాయి. దీంతో 10 గ్రాముల ధర సరికొత్త ఆల్‌టైం రికార్డు స్థాయికి చేరింది. దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం రూ.675 పెరిగి మొత్తం ధర 39,670కి చేరింది. రూపాయి బలహీన పడటంతోబాటు అంతర్జాతీయంగా పెరిగిన డిమాండ్ బంగారం ధరలు పెరిగేందుకు దోహదం చేశాయని వాణిజ్య విశే్లషకులు పేర్కొన్నారు. ఈ నెల 20వ తేదీ నుంచి వరుసగా ఇలా ప్రతిరోజూ బంగారం ధరలు తాజా రికార్డులను నెలకొల్పడం విశేషం. వెండి ధరలు సైతం కిలోపై రూ.1,450 పెరిగి మొత్తం ధర రూ.46,550కి చేరింది. నాణేల మార్కెట్లు, పారిశ్రామిక యూనిట్ల నుంచి తాజాగా పెరిగిన డిమాండ్‌తో వెండి ధరల పెరుగుదల జరిగిందని వ్యాపార వర్గాలు తెలిపాయి. అంతర్జాతీయంగా బంగారం ధరలు తాజాగా ఆరేళ్ల గరిష్ట స్థాయికి చేరాయి. ఔన్స్ బంగారం 1,554.56 డాలర్ల వంతున ట్రేడైంది. చైనా ఉత్పత్తుల దిగుమతులపై సుంకాలను అదనంగా పెంచుతున్నట్టు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన వ్యాఖ్యలతో స్టాక్ మార్కెట్ల వైపు నుంచి మదుపర్ల దృష్టి బంగారంపై మళ్లిందని అంటున్నారు. దేశీయ కరెన్సీ రూపాయి మారకం విలువ ఆరంభ ట్రేడింగ్‌లో 42 పైసలు కోల్పోయి రూ.72.08గా నిలిచింది. ఈక్రమంలో డాలర్ బలపడటంతోబాటు, అంతర్జాతీయంగా పెరిగిన డిమాండ్ బంగారం ధరలు ఆకాశాన్నంటేలా చేశాయి. దేశ రాజధాని ఢిల్లీలో 99.9 శాతం స్వచ్ఛ బంగారం ధర రూ.39,670, 99.5 శాతం స్వచ్ఛ బంగారం రూ.39,500 వంతున ట్రేడయ్యాయి. ఇక కిలో వెండి రూ. 46.550కు చేరగా, వీక్లీ డెలివరీ పద్ధతిలో సరఫరా చేసే వెండి ధర కిలోపై రూ.1,625 తగ్గింది. మొత్తం ధర రూ.45,291కు చేరింది. అలాగే వెండి నాణేలు 100 పీసుల ధర కొనుగోళ్లలో రూ.94,000, విక్రయాల్లో రూ.95.000 వంతున ట్రేడైంది.