బిజినెస్

ఈ-కామర్స్‌కు కొత్త మార్గదర్శకాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 27: ఈ కామర్స్ సంస్థల వినియోగదారుల ప్రయోజనాలను రక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం త్వరలో కొత్త వినియోగదారుల రక్షణ చట్టంలో మరిన్ని సరికొత్త మార్గదర్శకాలను ప్రవేశపెట్టనుంది. ఇప్పటికే ఈ మార్గదర్శకాలకు సంబంధించిన డ్రాఫ్ట్ సిద్ధమైంది. ఈమేరకు నిబంధనలను ఉల్లంఘించిన సంస్థలపై సంబంధిత నియంత్రణ సంస్థ కఠిన చర్యలు తీసుకోవడానికి వీలుకలుగుతుంది. వచ్చే డిసెంబర్ నుంచి ఈ కొత్త వినియోగదారుల రక్షణ చట్టాన్ని అమలులోకి తేవాలని కేంద్ర వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. ఇందుకోసం సంబంధిత సంస్థల వాటాదారుల అభిప్రాయాలను సైతం ఈనెల 15 వరకు సమీకరించడం జరిగింది. ఈమార్గదర్శకాలు ఈకామర్స్ వినియోగదారుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని రూపొందించడం జరిగిందని కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి రామ్‌విమాస్ పాశ్వాన్ మంగళవారం నాడిక్కడ విలేఖరులకు తెలిపారు. కొత్త చట్టానికి నిబంధనలు (రూల్స్) పొందుపరిచబోయే ముందు పార్లమెంటు సభ్యులతో సైతం మంత్రి పాశ్వాన్ మంగళవారం భేటీ అయ్యారు. సుమారు 12 మంది పార్లమెంటు సభ్యులు ఈ సమావేశానికి హాజరయ్యారు. సమావేశానంతరం పాశ్వాన్ విలేఖరులతో మాట్లాడారు. వినియోగదారుల చట్టంలో ఈకామర్స్‌కు సంబంధించిన మార్గదర్శకాలను పొందుపరచాల్సిందేనని సమావేశంలో అందరు పార్లమెంటేరియన్లూ అభిప్రాయపడ్డారని మంత్రి ఈ సందర్భంగా తెలిపారు. ప్రతి ఈ-కామర్స్ సంస్థ ఈ కొత్త మార్గదర్శకాలకు తాము కట్టుబడి ఉంటామని స్వీయ డిక్లరేషన్ ఇవ్వాల్సివుందన్నారు. కాగా తాజా మార్గదర్శకాల మేరకు ఈ కామర్స్ కంపెనీలు 14 రోజుల డెడ్‌లైన్‌లోగా వినియోగదారుల రీఫండ్ విజ్ఞప్తిని పరిష్కరించాలి. అలాగే ఈ- టైలర్స్ వస్తువులు, సేవలు విక్రయాలు జరిపే సంస్థల వివరాలు వెబ్‌సైట్‌లో పొందుపరిచి వినియోగదారుల సమస్యల పరిష్కారానికి సంబంధించిన స్పష్టతను ఇవ్వాలి. అలాగే వినియోదారుడికి సంబంధించిన వ్యక్తిగత విషయాలు రక్షించాలి. ప్రత్యక్షంగాకానీ, పరోక్షంగా కానీ వస్తువులు, సేవల ధరలపై ప్రభావం లేకుండా చూడాలి. ఈ కొత్త మార్గదర్శకాలతో కూడిన చట్టం అమలులోకి వస్తే నిబంధనల ఉల్లంఘనలపై రెగ్యులేటరీ విభాగానికి కఠిన చర్యలు తీసుకునేలా అధికారాలు సంక్రమిస్తాయని, అలాగే వినియోగదారుల న్యాయస్ధానాలకు సైతం అదనంగా అధికారాలు వస్తాయని కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ కార్యదర్శి కే. శ్రీవాత్సవ తెలిపారు. ఇలావుండగా కొత్త వినియోగదారుల రక్షణ చట్టం 2019కి ఇటీవల పార్లమెంట్‌లో ఆమోదం తెలిపింది. అన్నివర్గాల ఆమోదంతో ఈ-కామర్స్ వినియోదారుల ప్రయోజనాలను రక్షించే మార్గదర్శకాలను పొందుపరచేందుకు తాజాగా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.