బిజినెస్

మాకు మూలధనం సాయం వద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఆగస్టు 27: ఇప్పటికే ఆర్థికంగా సంతృప్తికర స్థాయిలో ఉన్నామని, కేంద్ర ప్రభుత్వం నుంచి తాజా మూలధన సహకారం తమకు అవసరం లేదని స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) మేనేజింగ్ డైరెక్టర్ ఆర్జిత్ బసు మంగళవారం నాడిక్కడ స్పష్టం చేశారు. ప్రభుత్వ రంగ బ్యాంకుల ఆర్థిక పునరుత్తేజానికి, ద్రవ్య లభ్యతను పెంచేందుకు, రుణ సామర్థ్యాన్ని రూ. 5ట్రిలియన్లకు పెంచేందుకు తక్షణ సాయంగా రూ. 70వేల కోట్లు అందజేస్తామని కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈక్రమంలో ఎస్‌బీఐ ఎండీ ప్రకటన ప్రాధాన్యతను సంతరించుకుంది. గతంలోప్రభుత్వం వ్యూహాత్మక ఆర్థిక సాయానికి ప్రణాళికలు రూపొందించిందని, ఐతే దేశ ఆర్థిక స్థితిపై వచ్చిన అసత్య ప్రచారంతో తక్షణ ఆర్థిక సాయానికి ప్రభుత్వం ముందుకు వస్తోందని, అలాంటి సాయం తమకు అవసరం లేదని ఆర్జిత్ బసు మంగళవారం నాడిక్కడ స్పష్టం చేశారు. ప్రస్తుతం తమ బ్యాంకు ఆర్థిక స్థితి పటిష్టంగానే ఉందన్నారు. మార్కెట్‌లో వెనుకబడి ఉన్న బ్యాంకులకు కేంద్ర నిధులు చొప్పించాల్సిన ఆవశ్యకత ఉండవచ్చని ఆయన తెలిపారు. ఇండియన్ చాంబర్ ఆఫ్ కామర్స్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమానికి హాజరైన సందర్భంగా ఆర్జిత్ బసు విలేఖరులతో మాట్లాడారు. ప్రాధాన్యత లేని ఆస్తులను విక్రయించడం ద్వారా మూల ధన నిల్వలు పెంచుకోవాలని తమ బ్యాంకు ప్రణాళికలు అమలు చేస్తోందని ఆయన తెలిపారు. ఇప్పటికే తమ బ్యాంకు ఎస్‌బీఐ కార్డుల ఐపీఓను ప్రకటించి అమలు చేస్తోందని, అలాగే మూలధనాన్ని పెంచుకునే దిశగా చర్యలను చేపడుతున్నామని తెలిపారు.