బిజినెస్

వరుసగా మూడో రోజూ లాభాల్లో మార్కెట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి : వరుసగా మూడోరోజూ దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల బాటపట్టాయి. వాహన, లోహ, ఫైనాన్షియల్ స్టాక్స్ మంచి లాభాలను అందుకోవడం మార్కెట్ల ఫలితాలను ప్రభావితం చేసింది. బీఎస్‌ఈ 30 షేర్ల సూచీ సెనె్సక్స్ మంగళవారం నాడు 147.15 పాయింట్లు (0.39శాతం) లాభపడి 37,641.27 పాయింట్ల ఎగువన స్థిరపడింది. ఇంట్రాడేలో ఈ సూచీ 37.731.51 పాయింట్ల గరిష్టం, 37,449.69 పాయింట్ల కనిష్టం నడుమ కదలాడింది. అలాగే బ్రాడర్ ఎన్‌ఎస్‌ఈ సూచీ నిఫ్టీ సైతం 47.50 పాయింట్లు (0.43శాతం) లాభపడి 11,105.35 పాయింట్ల ఎగువన స్థిరపడింది. ఇంట్రాడేలో ఈ సూచీ ఓ దశలో 11,141.75 పాయింట్ల గరిష్టానికి ఎగబాకి తర్వాత 11,049.50 పాయింట్ల కనిష్టానికి దిగింది. కాగా సెనె్సక్స్ ప్యాక్‌లో టాటామోటార్స్ అత్యధికంగా 8.87 శాతం లాభపడింది.
అలాగే టాటాస్టీల్, ఎన్‌టీపీసీ, ఇండస్‌ఇండ్ బ్యాంక్, వేదాంత, ఎం అండ్ ఎం సైతం 3,85 శాతం లాభాలను సంతరించుకున్నాయి. మరోవైపు భారతి ఎయిర్‌టెల్, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, టీసీఎస్, కోటక్ బ్యాంక్, సన్‌పార్మా, హెచ్‌యూఎల్, యాక్సిస్ బ్యాంక్ 3.58 శాతం నష్టపోయాయి. కాగా రిజర్వు బ్యాంక్ రూ. 1.76 లక్షల కోట్లు ప్రభుత్వానికి బదిలీ చేసేందుకు నిర్ణయం తీసుకోవడం మదుపర్ల సెంటిమెంటుపై సానుకూల ప్రభావం చూపింది. ఈ నిధుల బదిలీ కారణంగా ద్రవ్య లభ్యత గణనీయంగా పెరిగి ఆర్థికాభివృద్ధికి దోహదం చేస్తుందని విశే్లషకులు అంచనా వేస్తున్నారు. ఈక్రమంలో దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల పట్టగా అంతర్జాతీయ స్టాక్ మార్కెట్లు పుంజుకోవడం కూడా దేశీయ మార్కెట్లకు ఊతమిచ్చిందని అంటున్నారు. ప్రధానంగా అమెరికా-చైనా వాణిజ్య యుద్ధంపై ఇరు దేశాలు మరోమారు సమీక్షించనున్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు అన్ని దేశాల మార్కెట్లలో సానుకూలతలకు దోహదం చేశాయి. ఈక్రమంలో ఆసియా మార్కెట్లలో షాంఘై కాంపోజిట్ సూచీ, హ్యాంగ్‌సెంగ్, కోస్పి, నిక్కీ మంగళవారం లాభాల్లో ముగియగా, ఐరోపా మార్కెట్లు సైతం ఆరంభ ట్రేడింగ్‌లో లాభాలను సంతరించుకున్నాయి.
బలపడిన రూపాయి
అమెరికన్ డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ మంగళవారం 32 పైసలు బలపడింది. ఇంట్రాడేలో డాలర్‌పై 71.70 రూపాయలుగా ట్రేడైంది. ఇక అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు 0.93 శాతం పెరిగాయి. బ్యారెల్ 58.66 డాలర్లుగా ట్రేడైంది.