బిజినెస్

యాక్సెంచూర్‌కు 311 మంది విద్యార్థుల ఎంపిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం : ప్రముఖ బహుళజాతి, వృత్తి సేవల సంస్థ యాక్సెంచూర్‌కు గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం నుంచి భారీ స్థాయిలో 311 మంది విద్యార్థులు ఎంపికై రాష్ట్రంలోనే సరికొత్త ప్లేస్‌మెంట్ రికార్డు సృష్టించారు. గీతం విశ్వవిద్యాలయం విశాఖ ప్రాంగణంలో మూడు రోజులపాటు జరిగిన ప్రాంగణ ఇంటర్వ్యూలకు ఎక్సెంచూర్ సొల్యూషన్స్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ జీఎస్ రావు నేతృత్వంలో ప్రత్యేక బృందం హాజరైంది. అన్‌లైన్ పరీక్ష, సాంకేతిక పరీక్షతోపాటు బృంద చర్చలు, వ్యక్తిగత ఇంటర్వ్యూల ద్వారా 311 మంది విద్యార్థులను ఎంపిక చేసినట్టు మంగళవారం ప్రకటించింది. ఎంపికైన అభ్యర్థుల్లో ఇంజనీరింగ్‌లోని అన్ని బ్రాంచిల విద్యార్థులు ఉన్నారని గీతం ట్రైనింగ్ ప్లేస్‌మెంట్ విభాగం డైరెక్టర్ కమాండర్ గురుమూర్తి గంగాధరన్ తెలిపారు. ఎంపికైన విద్యార్థుల్లో 21 మందికి ఫుల్‌స్టాక్ ఇంజనీర్ ఉద్యోగానికి రూ.6.50 లక్షలు, 290 మంది అప్లికేషన్ డెవలప్‌మెంట్ ఆసోసియేట్ ఉద్యోగాలకు రూ.4.50 లక్షల వార్షిక వేతనాన్ని ఎక్సెంచూర్ సంస్థ ఆఫర్ చేసిందని వివరించారు. సంస్థలో ఉద్యోగ బాధ్యతలు స్వీకరించేందుకు ముందుగా ఇంజనీరింగ్ నాలుగో సంవత్సరం చదువుతూ ప్రాంగణ నియామకాల్లో ఎంపికైన విద్యార్థులు పెయిడ్ ఇంటర్న్‌షిప్ పొందడానికి అర్హత సాధించారని గీతం ట్రైనింగ్ ప్లేస్‌మెంట్ అధికారి తెలిపారు. కాగా ఇప్పటికే ప్రముఖ ఐటీ సంస్థలు మైక్రోసాఫ్ట్, డెలాయిట్ నిర్వహించిన ప్రాంగణ నియామకాల్లో విద్యార్థులను పెద్దఎత్తున భారీ వేతనాలతో ఎంపిక చేసుకున్నాయని ఆయన పేర్కొన్నారు. కాగా ఎక్సెంచూర్‌కు ఎంపికైన విద్యార్థులను గీతం వైస్‌ఛాన్సలర్ ప్రొఫెసర్ కె.శివరామకృష్ణ, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ కేవీజీడీ బాలాజీ అభినందించారు.